Shocking Accident Caught On Cam : ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం
- By CS Rao Published Date - 12:27 PM, Mon - 5 September 22

పంజాబ్‌లోని ఓ ఎగ్జిబిషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్లుండి జెయింట్ స్వింగ్ కిందపడింది. దాదాపు 40 అడుగుల నుంచి జెయింట్ స్వింగ్ కిందపడడంతో సుమారు 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద సమయంలో జెయింట్ స్వింగ్‌లో 50 మందికి పైగా ఉన్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలి నగరంలో చోటు చేసుకుంది. కాగా దాదాపు 50మంది ఎక్కిన ఈ జెయింట్ స్వింగ్ గాల్లో ఉండగానే ఫెయిల్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది ఈ జెయింట్ స్వింగ్ . దీంతో అందులో ఎక్కిన వారు గాయాలపాలయ్యారు. చాలామందికి నడుములు ఇరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో స్వింగ్‌పై మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను ఆస్పత్రులకు చేర్చారు. సకాలంలో చికిత్స అందించారు. కాగా ఘటన విషయంలో ఎగ్జిబిషన్ ఓనర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని.. గాయాలపాలైన వారికి చికిత్స జరుగుతోందని తెలిపారు
Related News

Sania Mirza: హైదరాబాద్ లో సానియా ఫేర్ వెల్ మ్యాచ్
ఇటీవలే ప్రొఫెషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంతగడ్డపై ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్