Most Miserable Country : దయనీయ దేశం జింబాబ్వే..ఇండియా ర్యాంక్ 103
''ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశం''గా(Most Miserable Country) జింబాబ్వే నిలిచింది.
- By pasha Published Date - 12:22 PM, Wed - 24 May 23

”ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశం”గా(Most Miserable Country) జింబాబ్వే నిలిచింది. అత్యంత దుర్భరంగా ఉన్న ఇతర దేశాల్లో వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా ఉన్నాయి. ప్రఖ్యాత ఆర్థికవేత్త, అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే విడుదల చేసిన ” వార్షిక మిజరీ ఇండెక్స్” (HAMI)లో ఈ వివరాలను వెల్లడించారు. ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడానికి మొత్తం 157 దేశాల ఆర్థిక స్థితిగతులు, దేశాల జీవన ప్రమాణాలను విశ్లేషించారు.
ఉక్రెయిన్, సిరియా, సూడాన్ కంటే దారుణంగా..
యుద్ధం, అంతర్యుద్ధం వంటి కారణాలతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్ కంటే దారుణమైన పరిస్థితి జింబాబ్వేలో ఉందని నివేదిక అభిప్రాయపడింది. జింబాబ్వేలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. ఇది గత సంవత్సరం 243.8 శాతానికి చేరుకుంది. అక్కడ నిరుద్యోగం చాలా పెరిగింది. లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. రక్తహీనతతో ఆ దేశ ప్రజలు సతమతం అవుతున్నారు. ఇవన్నీ వెరసి జింబాబ్వేను ”ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశం”గా(Most Miserable Country) మార్చాయని పేర్కొంటూ స్టీవ్ హాంకే ట్వీట్ చేశారు. ఇక ఈ లిస్టులో మన ఇండియా ర్యాంక్ 103. నిరుద్యోగ సమస్య ఇండియాలో ఎక్కువ ఉందని నివేదిక పేర్కొంది. అమెరికా ర్యాంక్ 134. ఫిన్లాండ్ ర్యాంక్ 109. ఇక ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో స్విట్జర్లాండ్, కువైట్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మాల్టా ఉన్నాయని నివేదిక తెలిపింది.

Tags
- Angola
- argentina
- Cuba
- Ghana
- Haiti
- india
- Lebanon
- miserable nations
- Most Miserable Country
- Sri Lanka
- Sudan
- syria
- Tonga
- top 15 list
- Turkey
- ukraine
- Venezuela
- world
- World Rank
- Yemen
- Zimbabwe

Related News

SCO Summit: జూలై 4న వర్చువల్ ఫార్మాట్లో SCO సమ్మిట్.. పీఎం మోదీ అధ్యక్షతన సమావేశం..!
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి (SCO Summit) భారతదేశం వర్చువల్గా ఆతిథ్యం ఇవ్వబోతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం (మే 30) ఈ సమాచారాన్ని ఇచ్చింది.