HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Will Return Will Avenge The Death Of Party Workers Sheikh Hasina

Bangladesh : తిరిగి వస్తా..పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా: షేక్‌ హసీనా

ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటు విమర్శలు చేశారు.

  • Author : Latha Suma Date : 18-02-2025 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Will return..will avenge the deaths of party workers: Sheikh Hasina
Will return..will avenge the deaths of party workers: Sheikh Hasina

Bangladesh : అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా జూమ్‌కాల్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాక.. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటు విమర్శలు చేశారు.

Read Also: Telangana Bill : ‘ప్రత్యేక తెలంగాణ’ బిల్లుకు 11 ఏళ్లు

విద్యార్థులు చేసిన ఆందోళనలకు అనేకమంది పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారు. అయినా యూనస్‌ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అవామీ లీగ్‌ పార్టీ నాయకులు ఓపికగా.. ఐక్యంగా ఉండాలి. నేను నా దేశానికి తిరిగి వస్తా. పార్టీ కార్యకర్తల మృతికి ప్రతీకారం తీర్చుకుంటా. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తా. జులై- ఆగస్టుల్లో జరిగిన నిరసనల్లో మరణించినవారు పోలీసుల కాల్పుల కారణంగా చనిపోలేదు. ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహిస్తే నిజాలు రుజువు అవుతాయని హసీనా అన్నారు.

దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉంది. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి, ప్రజల భద్రత ప్రమాదంలో ఉంది. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అని ఆమె పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆందోళనల్లో మృతిచెందిన పలువురు పోలీసుల కుటుంబాలతో హసీనా మాట్లాడారు. దేశాన్ని నడపడంలో తనకు ఎలాంటి అనుభవం లేదని గతంలోనే ఆయన అంగీకరించారు. అన్ని విచారణ కమిటీలను రద్దు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై, అధికారులపై దాడులు చేయడం యూనస్‌ అసమర్థతకు నిదర్శనం. ప్రణాళికతోనే నా తండ్రి నివాసాన్ని నాశనం చేశారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. అల్లర్లు ఆగలేదని హసీనా అన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న దేశం వీడిన షేక్‌ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

Read Also:  BJP : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు !

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Awami League party workers
  • bangladesh
  • Former Prime Minister Sheikh Hasina
  • I will return
  • I Will Take Revenge

Related News

BCB- BCCI

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

ఐసీసీ (ICC) రెవెన్యూ వాటాలో సింహభాగం బీసీసీఐకే దక్కుతుంది. బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ (ప్రసార హక్కులు) ద్వారా భారీ ఆదాయం వస్తుంది. 2023-28 కాలానికి గానూ వయాకామ్ 18 సంస్థతో రూ. 5,963 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

  • Bangladesh

    బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

  • Mustafizur Rahman

    కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

  • Hindu Man Dead

    బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు కాల్చివేత!

  • Bangladesh

    బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ‌!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!

  • నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. తొలి మ్యాచ్ ఏ జ‌ట్ల మ‌ధ్య అంటే?

  • సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

  • బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

  • అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

Trending News

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd