WhatsApp In App Dialer : వాట్సాప్‌లో ‘ఇన్-యాప్ డయలర్’.. కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్లకూ కాల్స్!
WhatsApp In App Dialer : మనం ప్రస్తుతం ట్రూకాలర్, గూగుల్ డైలర్‌లకు చెందిన ఇన్-యాప్ డయలర్‌లను ఎక్కువగా వాడుతున్నాం.
- Author : Pasha
Date : 27-04-2024 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
WhatsApp In App Dialer : మనం ప్రస్తుతం ట్రూకాలర్, గూగుల్ డైలర్‌లకు చెందిన ఇన్-యాప్ డయలర్‌లను ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఇన్-యాప్ డయలర్ లేదు. త్వరలోనే ఆ సౌకర్యాన్ని వాట్సాప్ తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్-యాప్ డయలర్ ద్వారా మనం కాంటాక్ట్ లిస్ట్లోలేని నంబర్లకు కూడా నేరుగా వాట్సాప్ నుంచే నార్మల్ కాల్ చేయొచ్చు. ప్రస్తుతం కాంటాక్ట్ లిస్టులో ఉన్న నంబరుకు మాత్రమే మనం వాట్సాప్ ద్వారా కాల్స్ చేసుకోగలుగుతున్నాం. ఇకపై ఆ అవసరం ఉండదు.ఎందుకంటే ఇన్-యాప్ డయలర్(WhatsApp In App Dialer) అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.9.28 వినియోగించే వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దీన్ని అందరు యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు. చాలా మంది వాట్సాప్ యూజర్లు ఆడియో, వీడియో కాల్స్ చేయడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రత్యేకించి ఇంటర్నేషనల్ కాల్స్ చేసేటప్పుడు వాట్సాప్ వాడటానికి ప్రయారిటీ ఇస్తారు. నెట్వర్క్ ప్రాబ్లమ్ లేకుండా ఉండేందుకు, తక్కువ ఖర్చులో కాల్ చేసేందుకు వాట్సాప్‌ను వాడుతారు.
We’re now on WhatsApp. Click to Join
- ఇటీవల వాట్సాప్ లోగో కలర్ మారింది. ఇప్పుడది గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది. గతంలో ఇది బ్లూ కలర్ లో ఉండేది. ఈ మార్పు దశలవారీగా వినియోగదారులకు కనిపిస్తుంది.
- లోగో రంగును మార్చడంపై పలువురు నెటిజన్లు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. గతంలో ఉన్న నీలిరంగు చాలా బాగుండేదని, కొత్త ఆకుపచ్చ రంగులో ఈ యాప్ ను చూడడం అసహ్యంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
Also Read : Junior Civil Judge Posts : 150 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- వాట్సాప్‌లో మరో మార్పు కూడా కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ డివైజెస్‌లో వాట్సాప్ డార్క్ మోడ్ మరింత ముదురు రంగులోకి మారింది. లైట్ మోడ్ లో పఠన సౌలభ్యం మరింత మెరుగుపడింది.
- ఐఓఎస్‌లోని కొన్ని బటన్లు, కొన్ని ఐకాన్లు మేకోవర్ అయ్యాయి. మెరుగైన యాక్సెస్ ను అందించడానికి వాటి మధ్య ఎక్కువ స్పేస్‌ను ఏర్పాటు చేశారు.
- గతంలో వాట్సాప్ పైభాగంలో కనిపించిన ట్యాబ్ లను స్క్రీన్ కింది భాగంలోకి మార్చారు. దీనివల్ల మీరు ఫోన్ ను పట్టుకునే విధానాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా.. వాటిని క్షణాల్లో యాక్సెస్ చేయగలరు. వాట్సాప్ చాట్స్ ట్యాబ్ లో ఇప్పుడు వాట్సాప్ లోగో కూడా కనిపిస్తుంది.