Viral : కోహ్లీ అభిమాని..రోహిత్ అభిమానిని తలపై బ్యాట్ తో కొట్టి చంపాడు..!!కోహ్లీని అరెస్టు చేయండంటూ..!!
ఫుట్‌బాల్ కు సంబంధించిన రెండు జట్ల ఫ్యాన్స్ రక్తం కారేలా కొట్టుకోవడం..చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ క్రికెట్ విషయంలో మాత్రం చాలా అరుదుగా వినిపిస్తుంటాయి.
- By hashtagu Published Date - 10:13 AM, Sat - 15 October 22

ఫుట్‌బాల్ కు సంబంధించిన రెండు జట్ల ఫ్యాన్స్ రక్తం కారేలా కొట్టుకోవడం..చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ క్రికెట్ విషయంలో మాత్రం చాలా అరుదుగా వినిపిస్తుంటాయి. తాజాగా జరిగిన ఘటన ఫుట్‌బాల్ సంఘటనలను గుర్తు చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ అభిమాని RCBని ఎగతాళి చేసినందుకు రోహిత్ శర్మ అభిమానిని తలపై బ్యాట్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
అరియలూర్ జిల్లాలో మద్యం మత్తులో తన స్నేహితుడిని చంపినందుకు 21 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి, ఆపై జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
కీలపాలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో రోహిత్ శర్మ అభిమాని విఘ్నేష్, విరాట్ కోహ్లీ అభిమాని ధర్మరాజ్ క్రికెట్‌పై చర్చిస్తున్నారు. ఇద్దరూ మద్యం సేవించారు.విఘ్నేష్ IPL జట్టు ముంబై ఇండియన్స్‌కు సపోర్టు చేశాడు. ధర్మరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సపోర్టు చేశాడు.
https://twitter.com/eyemsakshi/status/1581117693112901633?s=20
ఈ డిస్కషన్ లో విఘ్నేష్ విరాట్ కోహ్లీని, ఆర్‌సిబిని ఎగతాళి చేయడంతో ధర్మరాజ్ తట్టుకోలేక మొదట బాటిల్‌తో దాడి చేశాడు. తర్వాత క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడు. దీంతో విఘ్నేష్ మృతి చెందడంతో..ధర్మరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ట్విటర్‌లో కోహ్లీని అరెస్ట్ చేయండి అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
#ArrestKohli: Why fans are demanding Virat Kohli's arrest ahead of T20 World Cup 2022? Explainedhttps://t.co/DjL8Oaio8k#ArrestKohli #ViratKohli𓃵 #kohli #T20WorldCup #T20WorldCup2022 #cricket #Viratians #truescoop #truesccoopnews
— True Scoop (@TrueScoopNews) October 15, 2022