Emotional Goat:మేకను అమ్మేసిన యజమాని.. హత్తుకొని మరి ఏడ్చేసిందిగా.. ఈ వీడియో చూశారా?
సాధారణంగా చాలామంది ఇళ్లలో జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో కుక్క, పిల్లి, తో పాటుగా
- Author : Anshu
Date : 20-07-2022 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా చాలామంది ఇళ్లలో జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో కుక్క, పిల్లి, తో పాటుగా గొర్రె, మేకలు వంటివి పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ గొర్రె, మేకలను ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా పెంచుకున్నప్పటికీ ఏదో ఒక రోజు వాటిని కోసుకు తినడమో లేదంటే వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ఈ గొర్రె,మేకలు లాంటి జంతువులపై అమితంగా ప్రేమను పెంచుకొని వాటికి పేర్లు పెట్టి మరి పిలుస్తూ ఉంటారు.
మూగ జీవాలు కూడా మనుషుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటాయి. అయితే మనుషులతో పాటు జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి అన్నదానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే చాలా జంతువులు వాటిని పెంచిన యజమానులపై ఎనలేని ప్రేమను చూపిస్తూ ఉంటాయి. ఈ గొర్రెలు, మేకలు లాంటి జంతువులను అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ యజమానులను విడిచి వెళ్లడానికి ఆ గొర్రెలు బాధపడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Goat brought to be sold hugs owner, cries like human 💔😭 pic.twitter.com/k5LwYRKDqW
— Ramasubramanian V. Harikumar 💎 (@Ram_Vegan) July 15, 2022
ఒక మేకను తన యజమాని అమ్మేయగా అమ్మద్దు అంటూ ఆ యజమానిని పట్టుకొని మనిషిలా ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఒక వ్యక్తి తన మేకను తీసుకొని అమ్మడానికి మార్కెట్ కు వచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఆ మేకను అమ్మడానికి ఒప్పందం జరుపుకుంటూ ఉండగా ఇంతలో ఆ మేక ఆ యజమాని భుజంపై తలపెట్టి ఏడ్చింది. అయితే ఆ మూగజీవి యజమానిని హత్తుకొని ఏడవడం చూసి చుట్టుపక్కల వారి హృదయాలను కదిలించింది. ఆ మేక చేసిన పనికి కొందరు వ్యక్తుల కళ్ళలో నీళ్లు ఆగలేదు. అలాగే ఆ మేక ఏడ్చిన విధానాన్ని చూసి నెటిజన్లు కూడా బాధపడుతున్నారు.