HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us State Secretary Expresses Concern Over China Forcefully Gathering Dna From Tibetans In Tibet

China Dna Attack : టిబెటన్లపై డీఎన్‌ఏ అటాక్.. చైనా ఏం చేస్తోందంటే ?

చైనా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇరుగుపొరుగు దేశాలపై దాని వేధింపులు ఆగడం లేదు. ఓ వైపు హాంకాంగ్ పౌరులను వేధిస్తున్న చైనా.. మరోవైపు టిబెట్ పౌరులను కూడా ఇబ్బంది(China Dna Attack) పెడుతోంది.

  • By Pasha Published Date - 01:06 PM, Mon - 15 May 23
  • daily-hunt
China Dna Attack
China Dna Attack

చైనా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇరుగుపొరుగు దేశాలపై దాని వేధింపులు ఆగడం లేదు. ఓ వైపు హాంకాంగ్ పౌరులను వేధిస్తున్న చైనా.. మరోవైపు టిబెట్ పౌరులను కూడా ఇబ్బంది(China Dna Attack) పెడుతోంది. టిబెట్‌ స్వతంత్ర ప్రాంతం (TAR) పై దశాబ్దాలుగా దురాగతాలను సాగిస్తోన్న చైనా.. ఇప్పుడు అక్కడి పౌరుల నుంచి బలవంతంగా డీఎన్‌ఏ శాంపిల్స్ (China Dna Attack)ను సేకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆరేళ్లలో సుమారు 12లక్షల మంది టిబెట్‌ స్వతంత్ర ప్రాంతం ప్రజల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్ ను చైనా పోలీసులు సేకరించారని ఒక అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆ ప్రాంతంలోని మూడో వంతు ప్రజల నుంచి శాంపిల్ సేకరణ ఇప్పటికే పూర్తి అయిందని అంచనా. పేరెంట్స్, కుటుంబీకుల అనుమతి లేకుండా టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను చైనా సేకరిస్తోందని ఇటీవల హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక ప్రస్తావించింది. టిబెట్‌ పౌరులను నియంత్రించడం, పర్యవేక్షించడం కోసమే డ్రాగన్ ఇటువంటి చర్యలకు తెగబడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

also read : China: పిల్లలను కనడానికి కొత్త నిబంధనలను రూపొందిస్తున్న చైనా..!

మానవ హక్కుల ఉల్లంఘనే 

చైనా ఈ తరహా చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌ కామెంట్ చేశారు. మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. బ్లింకెన్‌ వ్యాఖ్యలను అంతర్జాతీయ టిబెట్‌ ప్రచార సంస్థ (ICT) స్వాగతించింది. ‘సామాజిక నియంత్రణ పద్ధతులకు ప్రయోగశాలగా టిబెట్‌ను చైనా వాడుతోంది’ అని పేర్కొంది. 13వ శతాబ్దం మధ్య కాలం నుంచే టిబెట్ తమ దేశంలో భాగంగా ఉందని చైనా వాదిస్తోంది. కానీ టిబెటన్లు మాత్రం తాము ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉన్నామని, తమపై చైనా అధికారం చెల్లదని వాదిస్తున్నారు. యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు. తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 1951లో వేలాది మంది సైనికులను పంపి టిబెట్‌ను చైనా ఆక్రమించుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • China Dna Attack
  • DNA samples
  • forcefully
  • tibet
  • Tibetans
  • US State Secretary

Related News

Nepal Currency

Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

చైనా ప్రతి రంగంలోనూ తన పట్టును బలోపేతం చేసుకుంటోంది. కరెన్సీ ముద్రణలో కూడా అదే చేసింది. చైనా బ్యాంక్‌నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC) అనే చైనా ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నేపాల్ కరెన్సీని ముద్రిస్తోంది.

  • Indian Girl

    Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

Latest News

  • Telangana Grama Panchayat Elections : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

  • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

  • Maruva Tarama : ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

  • Shubman Gill : టీమిండియా ఓటమి పై స్పందించిన శుభమన్ గిల్!

  • CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్

Trending News

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd