Union Budget 2024-25 : ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి..తగ్గుతున్నాయంటే..!!
ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 25 శాతానికి పెంచింది. అలాగే కెమికల్స్, పెట్రో కెమికల్స్ పైనా కస్టమ్స్ డ్యూటీని పెంచారు
- Author : Sudheer
Date : 23-07-2024 - 3:02 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ అధికారంలోకి రావడంతో ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రూ.48.21 లక్షల కోట్లతో సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.38లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.3శాతం ఉంటుందని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16లక్షల కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. మాములుగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారంటే సామాన్య ప్రజలు ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో..ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈరోజు బడ్జెట్ ఫై కూడా అలాగే ఆసక్తి కనపరిచాడు. ఈసారి సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
కేంద్ర బడ్జెట్ ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తుల రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 25 శాతానికి పెంచింది. అలాగే కెమికల్స్, పెట్రో కెమికల్స్ పైనా కస్టమ్స్ డ్యూటీని పెంచారు. టెలికాం పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 15 శాతానికి పెంచారు. ఫెర్టిలైజర్లు, పురుగు మందుల తయారీలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్పై కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఈ కేంద్ర బడ్జెట్ లో బంగారం,వెండి, సెల్ ఫోన్ లపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించారు.. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు కస్టమ్ డ్యూటీ మినహాయించారు. .. మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గించారు. 20 రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీంతొ వాటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
Read Also : Hypder Aadi : అల్లు అర్జున్ ని ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యాన్స్ కి ఆది రిక్వెస్ట్..!