Miss Japan Exposed : కొంపముంచిన అఫైర్.. కిరీటాన్ని వెనక్కి ఇచ్చేసిన ‘మిస్ జపాన్’
Miss Japan Exposed : 2024 సంవత్సరానికి ‘మిస్ జపాన్’గా 26 ఏళ్ల కరోలినా షినో నిలిచారు.
- By Pasha Published Date - 03:21 PM, Tue - 6 February 24

Miss Japan Exposed : 2024 సంవత్సరానికి ‘మిస్ జపాన్’గా 26 ఏళ్ల కరోలినా షినో నిలిచారు. ఈమె ఉక్రెయిన్ సంతతి వనిత. గత నెలలో ‘మిస్ జపాన్’ టైటిల్‌ను అందుకున్న ఆమె.. ఇప్పుడు ఆ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఎందుకో తెలుసా ? వివరాలు తెలియాలంటే ఈ కథనం మీరు చదవాల్సిందే..
We’re now on WhatsApp. Click to Join
పెళ్లి కాని యువతులు మాత్రమే మిస్ జపాన్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను కరోలినా షినో ఉల్లంఘించారు. ఆమెకు కుమా మేడా అనే పెళ్లయిన వైద్యుడితో అఫైర్ ఉందంటూ జపాన్ మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి. ఈవిషయం బయటికి రావడంతో మిస్ జపాన్ పోటీల నిర్వాహకులు తొలుత కరోలినా షినోను సమర్ధించారు. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిందనే విషయం కరోలినాకు తెలియదంటూ వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. కుమా మేడాకు వివాహితుడే అనే విషయం తెలిసి కూడా అతడితో కరోలినా డేటింగ్ చేసిందని ఆ తర్వాత వెల్లడైంది. ఈవిషయాన్ని చివరకు కరోలినా కూడా ఒప్పుకుంది. దీనిపై ‘మిస్ జపాన్’ పోటీల నిర్వాహకులకు తప్పుడు సమాచారాన్ని అందించినందుకు ఆమె క్షమాపణలు చెప్పింది. తనకు ప్రదానం చేసిన మిస్ జపాన్ టైటిల్‌ను నిర్వాహకులకు వెనక్కి ఇచ్చేసింది. దీంతో 2024 సంవత్సరానికి సంబంధించిన మిస్ జపాన్(Miss Japan Exposed) టైటిల్ తొలిసారిగా ఎవరికీ దక్కకుండా ఉండిపోయింది. ఈ పోటీల చరిత్రలో ఈవిధమైన పరిణామాలు సంభవించడం ఇదే తొలిసారి.
Also Read : Uttarakhand Civil Code : అసెంబ్లీలో యూసీసీ బిల్లుపై చర్చ.. ‘లివిన్’పై సంచలన ప్రతిపాదనలు
ఇక కరోలినా షినో వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. ఆమెకు ఐదేళ్ల వయసు ఉండగానే వాళ్ల ఫ్యామిలీ ఉక్రెయిన్ నుంచి జపాన్‌కు వలస వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉక్రెయిన్ సంతతివారే. అయితే జపాన్‌కు వచ్చిన తర్వాత కరోలినా తల్లి తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం జపాన్‌కు చెందిన ఒక వ్యక్తిని పెళ్లాడింది. అంటే కరోలినాకు పుట్టుకపరంగా జపాన్ మూాలాలు లేవు. అయితే ఆమె మిస్ జపాన్ పోటీల సందర్భంగా తనను తాను జపాన్ సంతతి వనితగా చెప్పుకున్నారు. దీన్ని చాలామంది వ్యతిరేకించారు. ఉక్రెయిన్ సంతతికి చెందిన యువతికి మిస్ జపాన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై స్థానిక మీడియాలో పెద్దచర్చే నడిచింది. చివరకు ఈ ఒత్తిడికి తలొగ్గిన కరోలినా తనకు దక్కిన పురస్కారాన్ని వదులుకున్నారు.