Dallas Air Show : గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. డల్లాస్ ఎయిర్ షోలో ఘటన
అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు...
- By Prasad Published Date - 08:42 AM, Sun - 13 November 22

అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు ఢీకొన్నాయని ఏవియేషన్ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన జరిగినప్పుడు డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో ‘వింగ్స్ ఓవర్ డల్లాస్ ఎయిర్ షో’ సందర్భంగా బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్ట్, బెల్ P-63 కింగ్‌కోబ్రా ప్రదర్శన చేస్తున్నాయి.సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోలు చిన్న విమానం దిగువ-ఎగిరే B-17పైకి దిగి చివరికి దానిలోకి దూసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రెండు విమానాలు డీకొట్టుకోవడంతో ముక్కలుగా విరిగి నేలపై పడిపోయాయి. ఇదిలా ఉండగా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) తెలిపింది. అయితే కూలిపోయే సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది ధృవీకరించలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా జరిగిన వైమానిక యుద్ధంలో విజయం సాధించడంలో B-17, నాలుగు ఇంజిన్ల బాంబర్ ప్రధాన పాత్ర పోషించింది.
https://twitter.com/DaleStarkA10/status/1591530928077430784?s=20&t=z3hzDlj161qcR9O_7IDpEg