Viral Video : జంగిల్ సఫారీలో రెండు ఏనుగుల భీకర ఫైట్
జంగిల్ సఫారీ అంటేనే ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. మామూలుగా మనం జూలో చూసే జంతువులన్నీ తమ సహజమైన ఆవాసాల్లో ఫ్రీగా తిరుగుతుంటే అత్యంత దగ్గర్నుంచి చూసే అవకాశం.
- Author : Hashtag U
Date : 13-11-2021 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
జంగిల్ సఫారీ అంటేనే ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. మామూలుగా మనం జూలో చూసే జంతువులన్నీ తమ సహజమైన ఆవాసాల్లో ఫ్రీగా తిరుగుతుంటే అత్యంత దగ్గర్నుంచి చూసే అవకాశం. అయితే, ఇలాంటి సందర్భాల్లో వాటి నిజస్వరూపాన్ని చూసే అరుదైన అవకాశం కొంతమందికి దక్కుతుంది. జోహన్నస్‌బర్గ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది.
సౌతాఫ్రికాలో లెక్కలేనన్ని జంగిల్ సఫారీలు ఉంటాయి. వాటిలో జోహన్నస్‌బర్గ్ సఫారీ మోస్ట్ స్పెషల్. ఈ మధ్యనే అక్కడ సఫారీకి వెళ్లిన కొంతమందికి రెండు ఏనుగుల ఫైటింగ్ చూసే అవకాశం దక్కింది. దాదాపు ఐదు నిమిషాల పాటు రెండు గజ ఏనుగులు ఒకదానితో ఒకటి ఫైటింగ్ చేసుకున్నాయి.