Charge For Phone Number : ఫోన్ నంబరుపైనా ఛార్జీ.. ట్రాయ్ సంచలన సిఫార్సు
ఒకప్పుడు మనం సిమ్‌కార్డు కొనేందుకు డబ్బులు పే చేసే వాళ్లం.
- By Pasha Published Date - 03:33 PM, Thu - 13 June 24

Charge For Phone Number :ఒకప్పుడు మనం సిమ్‌కార్డు కొనేందుకు డబ్బులు పే చేసే వాళ్లం. ఆ తర్వాత టెలికాం కంపెనీలు పోటీపడుతూ ఫ్రీగా సిమ్‌లు ఇచ్చాయి. దీంతో చాలామంది ఒకటికి మించి సిమ్ కార్డులను తీసుకున్నారు. అయితే ఫోన్ నంబర్ల జారీపై గరిష్ఠ పరిమితి వచ్చాక ఈ దుర్వినియోగం తగ్గింది. తాజాగా మరినని కొత్త సిఫార్సులను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ రెడీ చేసింది. అవి అమలులోకి వస్తే ఇకపై మనం మొబైల్ ఫోన్ నంబరుకు, ల్యాండ్‌లైన్ నంబర్‌కు కూడా ఛార్జీని కట్టాల్సి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join
ఫోన్ నంబర్ల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ ఈ సిఫారసు చేసిందని తెలుస్తోంది. దీనివల్ల అవసరం లేని, అదనపు ఫోన్ నంబర్లను ప్రజలు వదిలేస్తారని ట్రాయ్ భావిస్తోంది. ఇటీవలకాలంలో స్మార్ట్‌ఫోన్లన్నీ డ్యూయల్ సిమ్ స్లాట్లతో వస్తున్నాయి. కొంతమంది వాటిలో రెండు చొప్పున సిమ్ కార్డులను వాడుతున్నారు. కొందరు మొదటి సిమ్‌కు మాత్రమే ప్రతినెలా రీఛార్జ్ చేస్తున్నారు. రెండో సిమ్ కార్డుకు ఎప్పుడో మూడు, నాలుగు నెలలకోసారి రీఛార్జ్ చేస్తున్నారు. అయినా తమ కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో టెలికాం కంపెనీలు అలాంటి నంబర్లను డీయాక్టివేట్ చేయడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వాటిని తొలగించే విషయంలో జాప్యం చేస్తున్నాయి. ఇలాంటి నంబర్లను భరిస్తున్న టెలికాం కంపెనీలపై పెనాల్టీలు వేయాలని కూడా ట్రాయ్ తాజాగా సిఫారసు చేయడం గమనార్హం.
Also Read :Text Books : మారని ‘ముందు మాట’.. పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు
టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఫోన్ల నంబరింగ్ స్పేస్‌ను కూడా ప్రభుత్వమే వాటికి అలాట్ చేస్తుంది. గతేడాది డిసెంబర్‌లో ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ ఫోన్ నంబర్లపై ఛార్జీ విధించవచ్చనే రూల్ ఉంది. పలు దేశాల్లో ఇప్పటికే ఫోన్ నంబర్లపై ఛార్జీలు వసూలు చేస్తున్న విషయాన్ని ట్రాయ్ గుర్తు చేస్తోంది. ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో నంబర్లపైనా వార్షిక ఛార్జీని వసూలు చేస్తున్నారు. అయితే అవన్నీ ధనిక దేశాలు. అక్కడి ప్రజల తలసరి ఆదాయాలు ఎక్కువ. భారత్ ఇంకా ఆ స్థాయికి వెళ్లలేదు. వాటి రేంజుకు మన దేశం చేరాలంటే ఇంకా చాలా ఏళ్ల టైం పడుతుంది. కాబట్టి మన దేశం స్థితిగతుల ప్రకారం ఇలాంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ నంబరుపై ఛార్జీని(Charge For Phone Number) ఒకసారి వసూలు చేసి వదిలేయాలా ? ప్రతి సంవత్సరం వసూలు చేయాలా ? అనే దానిపై కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించిన సిఫార్సులను త్వరలోనే కేంద్ర టెలికాం శాఖకు ట్రాయ్ అధికార వర్గాలు అందించనున్నాయి.