Jaishankar : పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్
పాకిస్థాన్ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు.
- By Latha Suma Published Date - 03:50 PM, Fri - 30 August 24

Jaishankar: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశానికి హాజరుకావాలని స్లామాబాద్ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అధికరణ రద్దు ఒక ముగిసిన కథ అని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మాల్దీవులతో మారుతున్న సంబంధాలపై మాట్లాడుతూ..ప్రపంచంలోని ఏ దేశాన్ని చూసినా పొరుగుదేశాలతో చిక్కుముడులు కనిపిస్తాయని, పొరుగుదేశాలతో సమస్యలు లేని దేశమంటూ ఏదీ కనిపించదని అన్నారు. ఇది పొరుగుదేశాల సహజ స్వభామని అన్నారు. పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారుతో ప్రధాన మంత్రి మోడీ ఇటీవల మాట్లాడారని, అక్కడి హిందువులు, మైనారిటీలకు భద్రతకు యూనస్ హామీ ఇచ్చారని జైశంకర్ చెప్పారు. మాల్దీవులు అధ్యక్షుడు మొహహ్మద్ మయిజ్జు హయాంలో మాల్దీవులతో సంబంధాల గురించి మాట్లాడుతూ, వారి విధానంలో నిలకడ లేకపోవడం, ఒడిదుడుకులు వంటివి ఉన్నా ఆ దేశంతో ఇండియా లోతైన సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. చైనా అనుకూలవాదిగా మయిజ్జుకు పేరుడంతో ఇటీవల కాలంలో ఇండియా-మాల్దీవుల మధ్య సంబంధాల్లో ఒకింత ఇబ్బందులు తలెత్తాయి. అయితే, భారత్ తమకు అత్యంత కీలక భాగస్వామి అని ఇటీవల జైశంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా మయిజ్జు స్పష్టం చేశారు.
Read Also: PM Modi : మరోసారి ప్రధాని మోడీకి దీదీ లేఖ