Viral Ukrainian: ఉక్రెయిన్ ‘హృదయ’ విదారకం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ ఘటన!
ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేటదాడి చేస్తుండటంతో ఆ దేశ పౌరులు బిక్కుబిక్కుమంటూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక భయపడిపోతున్నారు.
- By Balu J Published Date - 04:45 PM, Fri - 25 February 22
 
                        ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేటదాడి చేస్తుండటంతో ఆ దేశ పౌరులు బిక్కుబిక్కుమంటూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక భయపడిపోతున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దిక్కులు చూస్తున్నారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దాడుల నేపథ్యంలో మానవవీయ కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు పురుషులు దేశం విడిచివెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన కూతురిని సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తున్న వీడియో ఒకటి కంటతడి పెట్టిస్తోంది. తన కూతురిని సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో, గట్టిగా పట్టుకొని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. తన బిడ్డ కూడా రోదించడంతో ధైర్యం చెబుతూ బస్సు ఎక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘పుతిన్ జీ.. ఇప్పటికైనా యుద్ధం ఆపండి’’ అంటూ వేడుకుంటున్నారు ఉక్రెయిన్ వాసులు.
Ukrayna'da bir baba, ailesini güvenli bölgeye gönderirken vedalaşma anı kameraya böyle yansıdı.
#Kiev #Ukraina #worldwar3 pic.twitter.com/ttA9Ksk4rl
— Journoloji (@journoloji) February 24, 2022
 
                    



