Rahul Gandhi : నరేంద్ర మోడీ పాలనలో మార్పు లేదు.. కేవలం ప్రచారమే: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 06:27 PM, Mon - 9 June 25

Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రజల సంక్షేమంపై కన్నెత్తి చూడకుండా, కేవలం ప్రచారంపై దృష్టి పెట్టిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో వాస్తవ సమస్యలపై స్పందించకుండా, 2047 కలలపై మాత్రమే దృష్టి పెట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Read Also: AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
ఠానే జిల్లా ముంబ్రా దివా స్టేషన్ల మధ్య రద్దీగా ఉన్న లోకల్ రైలు నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ, మోడీ ప్రభుత్వం పదకొండేళ్లు పూర్తి చేసుకున్న వేళ, ఇలాంటి వార్తలు దేశంలోని అసలైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. భారతీయ రైల్వేలు కోట్లాది మంది జీవనాధారంగా ఉండగా, ఇవే ఇప్పుడు అప్రమత్తత, రద్దీ, గందరగోళానికి సంకేతంగా మారాయి” అని అన్నారు. అలాగేడఈ దేశాన్ని నడిపించాలంటే కేవలం కలలు కాదు, భూమి మీద వాస్తవాలను కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నేటి సమస్యలపై స్పందించకుండా, దూర భవిష్యత్తు కలలతో ప్రజలను మభ్యపెడుతోంది అని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఇలాంటి ఘోర సంఘటనలపై ప్రభుత్వ ప్రతిస్పందనలేమి నిరాశకు గురిచేస్తోందని, నరేంద్ర మోడీ పాలనలో జవాబుదారీతనం కనపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవికతను గుర్తించకుండా ప్రచారమే నడిపితే, ప్రజల నమ్మకం కోల్పోతారు అని హెచ్చరించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యాఖ్యలన్నీ మోడీ పాలనపై కొనసాగుతున్న విమర్శల్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్