Earthquake : థాయిలాండ్ ఎయిర్‌పోర్టు లాక్‌డౌన్
Earthquake : భూకంప ప్రభావంతో థాయిలాండ్ ఎయిర్‌పోర్టును (Thailand airport lockdown)లాక్‌డౌన్ చేశారు. బ్యాంకాక్(Bangkok)లో మెట్రో, విమాన సర్వీసులు నిలిపివేశారు
- By Sudheer Published Date - 04:20 PM, Fri - 28 March 25

మయన్మార్‌లో భారీ భూకంపం (Earthquake ) సంభవించి దేశాన్ని కుదిపేసింది. పశ్చిమ మండేలాలో 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది వరకు గాయపడినట్టు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావంతో మయన్మార్ రాజధాని నెపిడాలోని 1000 పడకల ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. ఆసుపత్రి లోపల సరిపోక వీధుల్లోనే గాయపడినవారికి చికిత్స అందజేస్తున్నారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Tamil Nadu Assembly : సీఎం అంటే మర్యాద లేదా?.. స్టాలిన్ ఆగ్రహం
భూకంప ప్రభావంతో మయన్మార్(Myanmar)లోని మండేలాలో అనేక నివాస భవనాలు కూలిపోయాయి. ఇర్రవడ్డి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన దెబ్బతిన్నది. థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఒక పురాతన మఠం కూడా పూర్తిగా ధ్వంసమైంది. భూకంప కేంద్రాన్ని సగైంగ్ పట్టణానికి 16 కి.మీ దూరంలో భూమికి 10 కి.మీ లోతులో గుర్తించారు. థాయిలాండ్‌లో కూడా భూకంపం భారీ నష్టం కలిగించింది. బ్యాంకాక్ సహా ఉత్తర థాయిలాండ్‌లో భవనాలు నేలమట్టమయ్యాయి.
DA Hike For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?
భూకంప ప్రభావంతో థాయిలాండ్ ఎయిర్‌పోర్టును (Thailand airport lockdown)లాక్‌డౌన్ చేశారు. బ్యాంకాక్(Bangkok)లో మెట్రో, విమాన సర్వీసులు నిలిపివేశారు. థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోవడంతో 43 మంది చిక్కుకున్నారు. ఈ భవనం కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.