Tamil Nadu Assembly : సీఎం అంటే మర్యాద లేదా?.. స్టాలిన్ ఆగ్రహం
Tamil Nadu Assembly : 'సీఎం అనే గౌరవం కూడా లేకుండా, వేళ్లు చూపిస్తూ ఏకవచనంతో మాట్లాడటం ఏమిటి?' అని ప్రతిపక్షంపై మండిపడ్డారు.
- Author : Sudheer
Date : 28-03-2025 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు అసెంబ్లీ(Tamil Nadu Assembly)లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK రాష్ట్రపరిస్థితులపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, స్పీకర్ దాన్ని తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించారు. వారిని శాంతపరిచే ప్రయత్నం చేసినా, వారు తమ వైఖరిని మార్చలేదు. ఈ క్రమంలో అధికారపక్షం మరియు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
Sara Ali Khan: మొన్న దిశా పటానీ.. ఇప్పుడు సారా అలీ ఖాన్, ఐపీఎల్‌లో బాలీవుడ్ తారల సందడి!
వివాదం ముదరడంతో స్పీకర్ కొందరు ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో సీఎం స్టాలిన్ (CM Stalin) ప్రతిపక్ష సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాంటి గౌరవప్రదమైన వేదికలో మర్యాద లేకుండా మాట్లాడటం తగదని అన్నారు. ‘సీఎం అనే గౌరవం కూడా లేకుండా, వేళ్లు చూపిస్తూ ఏకవచనంతో మాట్లాడటం ఏమిటి?’ అని ప్రతిపక్షంపై మండిపడ్డారు.
సభలో అశాంతిని సృష్టించడమే కాకుండా, అసెంబ్లీ నిబంధనలను పాటించకుండా వ్యవహరించడాన్ని స్టాలిన్ ఖండించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, సభ గౌరవాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సంఘటనతో అసెంబ్లీలో రాజకీయ వేడి పెరిగింది. ప్రభుత్వం మరియు ప్రతిపక్షం మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది.