Group 3 results : తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల
గ్రూప్-3లో టాప్ ర్యాంకర్(పురుషులు) 339.24 మార్కులు, గ్రూప్-3లో మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చిన టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 05:40 PM, Fri - 14 March 25

Group 3 results : తెలంగాణలో జరిగిన పోటీ పరీక్షల ఫలితాలు ఒక్కోటీ విడుదల అవుతున్నాయి. ఇటీవల గ్రూపు 1, గ్రూపు 2 ఉద్యోగాల ఫలితాలు విడుదలవగా.. తాజాగా గ్రూపు 3కి సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలను విడుదల చేయడంతో ర్యాంకర్ల జాబితాను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వదిలింది. ఫలితాలు వెలువడడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Jana Sena Formation Meeting : పవన్ కళ్యాణ్ ప్రసంగం పై ఉత్కంఠ
మొత్తం 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా.. ఈరోజు ఫలితాలను రిలీజ్ చేసింది. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు జరిగాయి. ఈ పోస్టుల కోసం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్-3లో టాప్ ర్యాంకర్(పురుషులు) 339.24 మార్కులు, గ్రూప్-3లో మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చిన టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. ఈ మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ – 1 ఫలితాలను మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసింది. కాగా, ఈ నెలలోనే గ్రూప్ 1, గ్రూప్ -2 ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10, 11 తేదీల్లోనే గ్రూప్ 1 మెయిన్ ఫలితాలు, గ్రూప్-2 రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది.