Fahad Fazil Aavesham : ఫాఫా ఆవేశం.. తెలుగు రీమేక్ హీరో ఎవరు..?
Fahad Fazil Aavesham జితు మాధవన్ డైరెక్షన్ లో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. ఈమధ్యనే రిలీజైన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ
- By Ramesh Published Date - 06:25 PM, Fri - 17 May 24
Fahad Fazil Aavesham జితు మాధవన్ డైరెక్షన్ లో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. ఈమధ్యనే రిలీజైన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ఫాఫా ఆవేశం కేవలం మలయాళం లోనే కాదు సౌత్ అంతా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అయితే ఆవేశం యాజిటీజ్ డబ్బింగ్ చేస్తారా లేదా రీమేక్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. తెలుగులో ఆవేశం సినిమా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ తెలుగులో ఫాహద్ ఫాజిల్ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అన్నది చర్చ నడుస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఫాఫా చేసిన గ్యాంగ్ స్టర్ పాత్రకు నందమూరి బాలకృష్ణ అయితే పర్ఫెక్ట్ అని అంటున్నారు.
గ్యాంగ్ స్టర్ గా ఉన్నా సినిమా చివరి వరకు ఒక్క ఫైట్ కూడా చేయని ఫాహద్ ఫాజిల్ తన నటనతో ఆడియన్స్ ని కట్టిపడేశాడు. అయితే ఇలాంటి పాత్రలో బాలయ్య నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆవేశం రీమేక్ కి బాలకృష్ణ ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే కచ్చితంగా బాలయ్య చేస్తే మాత్రం సినిమా బాగుంటుందని చెబుతున్నారు.
ఆవేశంతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఫాహద్ ఫాజిల్ త్వరలో పుష్ప 2 తో రాబోతున్న విషయం తెలిసిందే.
Also Read : Jagapati Babu : జపాన్ లో జగపతి బాబుకి మైండ్ బ్లాక్ ఫాలోయింగ్.. లేడీ ఫ్యాన్స్ తో జగ్గు భాయ్ వీడియో వైరల్..!