Dk Shivakumar Cbi Case : సుప్రీంలో డీకే శివకుమార్ కు ఊరట
సీఎం రేస్ లో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (Dk Shivakumar Cbi Case)కు సుప్రీంకోర్టులో బుధవారం తాత్కాలిక ఊరట లభించింది.
- Author : Pasha
Date : 17-05-2023 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (Dk Shivakumar Cbi Case)కు సుప్రీంకోర్టులో బుధవారం తాత్కాలిక ఊరట లభించింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను దేశ సర్వోన్నత న్యాయస్థానం జూలై 14 కు వాయిదా వేసింది. శివ కుమార్ (Dk Shivakumar Cbi Case) ఆస్తులపై ఈడీ, సీబీఐ దర్యాప్తును ప్రారంభించగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీబీఐ తనకు పదే పదే నోటీసులు జారీ చేస్తోందంటూ హైకోర్టును డీకే ఆశ్రయించారు. దీంతో అప్పట్లో విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది.
అనేక సార్లు స్టే పొడిగించడంతో..
అనేక సార్లు హైకోర్టు స్టేను పొడిగించడంతో.. సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కారోల్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. డీకే శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మే 23న ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టు ముందుకు రానుందని అందువల్ల సీబీఐ పిటిషన్ ను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అభిషేక్ సింఘ్వీ కోరారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్ పై విచారణను బెంచ్ వాయిదా వేసింది.