Shocking Video: కారు ఢిక్కీలో పిల్లల ప్రయాణం.. నెట్టింట్లో వీడియో వైరల్
కారు ఢిక్కీలో ముగ్గురు పిల్లలు ప్రమాదకరంగా ప్రయాణించారు.
- Author : Balu J
Date : 15-09-2022 - 4:02 IST
Published By : Hashtagu Telugu Desk
కారు ఢిక్కీలో ముగ్గురు పిల్లలు ప్రమాదకరంగా ప్రయాణించారు. వేగంగా వెళ్తున్న కారులో పిల్లల వెనుక ఢిక్కీలో కూర్చొని ప్రయాణించారు. ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలు పోవాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. ప్రమాదకర ప్రయాణం వద్దు అంటూ ట్విట్టర్ షేర్ చేశారు. గంటల వ్యవధిలోనే 11,000 వ్యూస్ సాధించింది.
“వారు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారు? దయచేసి చర్యలు తీసుకోండి సార్” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పేరెంట్స్ కారు లోపల కూర్చోగా, ముగ్గురు పిల్లలు ఓపెన్ బూట్ (ఢిక్కీలో) కూర్చొని ప్రయాణించడం పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
How irresponsible parents they are? Pls take review sir and action. @KTRTRS @TelanganaCOPs @HiHyderabad @tsrtcmdoffice pic.twitter.com/zqnoZ5L0HM
— Soncho Zara (@sonchozara) September 5, 2022