Inside Story : బిహార్ సీఎంను డిప్యూటీ సీఎంగా చేసేందుకు స్కెచ్.. లలన్ సింగ్ ఔట్ !?
Inside Story : బిహార్ రాజకీయాలు హీటెక్కాయి. అక్కడ అధికారంలో ఉన్న ఇండియా కూటమిలో చీలిక సంకేతాలు కనిపిస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- By Pasha Published Date - 08:04 AM, Sat - 30 December 23

Inside Story : బిహార్ రాజకీయాలు హీటెక్కాయి. అక్కడ అధికారంలో ఉన్న ఇండియా కూటమిలో చీలిక సంకేతాలు కనిపిస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం రోజు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ జాతీయ అధ్యక్షుడు మారిపోయాడు. ఇంతకుముందు వరకు జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేేశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన సమావేశంలో స్వయంగా లలన్ సింగ్ ప్రతిపాదన మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో జేడీయూ చీఫ్ పోస్టును కూడా నితీశ్ తన చేతిలోకి తీసుకున్నారు. ఇంతకీ ఎందుకు ? అనే దాని వెనుక ఒక స్టోరీ ఉందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదేంటో(Inside Story) ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం బిహార్‌ను పాలిస్తున్న సంకీర్ణ కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు ఉన్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సీఎంగా ఉన్నారు. జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న టైంలో లలన్ సింగ్ 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి లాలూప్రసాద్ యాదవ్‌తో సీక్రెట్‌గా సమావేశమయ్యారని.. తేజస్వి యాదవ్‌ను సీఎంగా చేసేందుకు కుట్ర పన్నారని కథనాల్లో ప్రస్తావించారు.
Also Read: India Vs Pakistan : ఉగ్రవాది హఫీజ్ సయీద్ అప్పగింతపై పాక్ రియాక్షన్ ఇదీ..
అప్పట్లో జేడీయూ చీఫ్ హోదాలో నితీశ్ కుమార్‌ను కలిసిన లలన్ సింగ్.. ‘‘18 సంవత్సరాలుగా మీరే సీఎం పోస్టులో ఉన్నారు. ఇప్పుడు తేజస్విికి సీఎంగా ఛాన్స్ ఇవ్వండి. మీరు డిప్యూటీ సీఎం పోస్టు తీసుకోండి. మన పార్టీకి ఉన్న సీట్లు తక్కువే. అసెంబ్లీలో ఆర్జేడీ బలమే ఎక్కువ’’ అని ప్రతిపాదించారని అంటున్నారు. అయితే ఈ ప్రపోజల్‌ను నితీశ్ తిరస్కరించారట. లలన్ సింగ్‌ను ఇంకా జేడీయూ చీఫ్ పోస్టులోనే కొనసాగిస్తే.. ఎమ్మెల్యేలతో తిరుగుబాటును క్రియేట్ చేసిినా చేయొచ్చనే ఆందోళనతో నితీశ్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ టెన్షన్ వల్లే పార్టీ చీఫ్ పదవిని నితీశే చేపట్టారని అంటున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీకి అత్యధికంగా 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.