Viral : అయోధ్య రాముడు కళ్లు తెరిచి చూస్తున్నాడు..!!
- Author : Sudheer
Date : 23-01-2024 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
అయోధ్య రాముడు (Balak Ram ) కళ్లు తెరిచి అటు ఇటు చూస్తున్నాడు..ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో ఈ వీడియో నే వైరల్ గా మారింది. కేవలం చూడడమే కాదు చిన్న చిరునవ్వు కూడా ఇస్తున్నాడు. ప్రస్తుతం టెక్నాలజీ (Technology) ఎంతగా అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. మనకళ్లను సైతం నమ్మలేని అద్భుతాలు టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఎక్కువగా సినిమాల్లోనే టెక్నాలజీ ని ఉపయోగించి దేవుళ్ల విగ్రహాల కళ్లు తెరిపించడం..చూడడం వంటివి చేసేవారు..కానీ ఇప్పుడు అయోధ్య (Ayodha ) బాల రాముడ్ని సైతం అటుఇటు చూసేలా చేసారు..అంతే కాదు చిన్న చిరు నవ్వు కూడా నవ్వేలా చేసి అబ్బురపరిచారు.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Ram Mandir Pran Prathistha) కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్నింటికన్నా ఒక వీడియో మాత్రం బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న బాలరాముడిని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూసినట్లే కనిపిస్తోంది. బాలరాముడు కళ్లు తెరిచి అటు ఇటు చూస్తున్నట్లు (Ram Lalla’s Idol ‘blinking eyes’) కనిపించింది. అంతే కాదు చిరునవ్వుతో కంటి రెప్పలు కొడుతూ తలను అటూ ఇటూ కదిలిస్తూ చూస్తున్నట్లు వీడియో లో ఉండడం తో ఈ వీడియో చూసిన వారంతా షేర్ చేస్తూ వైరల్ గా మార్చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
@happymi అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మందికి పైగా వీక్షించారు. 58 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోను చాలా మంది తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్‌ల్లో పెట్టుకుంటున్నారు. రామ మందిరంలో కొలువైన 51 అంగుళాల పొడవైన విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. కమలంపై నిలబడిన ఐదేళ్ల బాల రాముడి విగ్రహం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.
ఇక రామభక్తుల శతాబ్దాల కల సాకారమై అయోధ్యలోని భవ్య మందిరంలో కొలువైన రామ్‌లల్లాను ఇక నుంచి “బాలక్ రామ్”గా పిలువనున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయోధ్యలో కొలువుతీరిన రామయ్య ఐదేళ్ల పసిబాలుడుగా దర్శనమిస్తున్నందున ఆయన పేరును ‘బాలక్ రామ్’గా నిర్ణయించినట్టు తెలిపారు.
Now who did this? 🤩🙏 #Ram #RamMandir #RamMandirPranPrathistha #RamLallaVirajman #AyodhaRamMandir #Ayodha pic.twitter.com/2tOdav7GD6
— lakshmi (@happymi_) January 22, 2024
Read Also : Nara Lokesh: జనం మెచ్చేలా జన్మదినం జరిపారు: నారాలోకేశ్