HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Rajnath Meets Prime Minister Explanation On Security Preparedness

Pahalgam Attack : ప్రధానితో రాజ్‌నాథ్‌ భేటీ..భద్రతా సన్నద్ధతపై వివరణ

జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదుల ఏరి వేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీకి రాజ్ నాథ్ సింగ్ వివరించినట్లు సమాచారం. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్‌ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్ చౌహన్‌తో రాజ్‌నాథ్‌ ఆదివారం భేటీ అయ్యారు.

  • Author : Latha Suma Date : 28-04-2025 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajnath meets Prime Minister...explanation on security preparedness
Rajnath meets Prime Minister...explanation on security preparedness

Pahalgam Attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం రాజుకుంది. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు తెలిసింది. ఇక, జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదుల ఏరి వేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీకి రాజ్ నాథ్ సింగ్ వివరించినట్లు సమాచారం. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్‌ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్ చౌహన్‌తో రాజ్‌నాథ్‌ ఆదివారం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మన సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను రక్షణమంత్రి నేడు ప్రధానికి వివరించారు.

 Read Also:  CM Revanth Reddy : జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ప్రధాని మోడీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. కాగా, ఈ భేటీలో పాకిస్థాన్‎పై యుద్ధానికి ముహుర్తం ఖరారు చేయడానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత ఏం జరగబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాది పాక్‎పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఉగ్రమూకలు ఏ మూలన దాక్కున్నా వెతికి వెంటాడుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోడీ, రాజ్‎నాథ్ సింగ్ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా, జమ్ముకశ్మీర్‌ పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్‌ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తుర్కియేకు చెందిన పలు సీ-130 హెర్క్యులస్‌ విమానాలు పాక్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు సమాచారం.

Read Also:  Turkish Warplanes: పాకిస్తాన్‌కు టర్కీ యుద్ధ విమానాలు.. ఎందుకు ?

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India-Pakistan Border
  • Pahalgam Attack
  • pm modi
  • Union Defense Minister Rajnath

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd