Reels in Railway Station : ఇకపై రైళ్లలో రీల్స్ చేస్తే జైలుకే..!!
Reels : ఇదే సమయంలో కొందరు ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని , ఫేమస్ కావాలనే ఉద్దేశ్యం..రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు
- By Sudheer Published Date - 04:05 PM, Sat - 16 November 24

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెడ్ (Social Media Tread) నడుస్తోంది. దాదాపు అందరికి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాక చాలా మందికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకేముందు ఉదయం లేచిన దగ్గరి పడుకునే వరకు అంత సోషల్ మీడియా లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని , ఫేమస్ కావాలనే ఉద్దేశ్యం..రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతి రోజు ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్ చేయడం మానడం లేదు.
ఇదిలా ఉంటె తాజాగా రైల్వే బోర్డు (Railway Board) రీల్స్ (Reels ) చేసేవారికి హెచ్చరిక జారీ చేసింది.రైల్వే ప్రాంగణాల్లో, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేసే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది. రైల్వే ట్రాక్‌లు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న (Reels) ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘రైల్వే ట్రాకులపై వస్తువులు పెట్టడం, వాటిపై వాహనాలు నడపడం, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరంగా స్టంట్లు చేయడం లాంటి వికృత చేష్టలు చేస్తున్నారు. దీని వల్ల వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా, వందల మంది రైలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు’ అని రైల్వే తెలిపింది. రైళ్లకు దగ్గరగా వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్న ఘటనలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. అందుకే నిబంధనలు అతిక్రమిస్తూ రీల్స్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసులకు రైల్వే బోర్డు సూచించినట్లు తెలుస్తుంది.
Read Also : YSRCP : నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదు