Rahul : పిపలేశ్వర హనుమాన్ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు
- By Latha Suma Published Date - 01:27 PM, Mon - 20 May 24

Pipleshwar Hanuman Mandir: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాయ్‌బరేలి(Roy Bareli)లోని ప్రముఖ పిపలేశ్వర హనుమన్ ఆలయంని (Pipleshwar HanumanMandir)సందర్శించారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్థానం నుండి లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగిన సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్‌లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది. ఇక కాంగ్రెస్ యూపీలో ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఫలితాలపై అందరి ఆసక్తి నెలకొంది.
Read Also: Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతదేహం స్వాధీనం