HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Punganur Girl Was Killed By The Government Roja

RK Roja : పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే : రోజా

RK Roja : బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

  • Author : Latha Suma Date : 06-10-2024 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ex-minister-roja-tweet-on-deputy-cm-pawan-kalyan
ex-minister-roja-tweet-on-deputy-cm-pawan-kalyan

Punganuru Girl Murder Case : వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా పుంగనూరులో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటనపై స్పందించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన హత్యేనని ఆరోపించారు. సెప్టెంబర్ 29 ఆదివారం రాత్రి నుంచి తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ.. పాప ఆచూకీని వెతకడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోజా ఫైరయ్యారు. బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం సొంతజిల్లాలోని నియోజకవర్గంలో ఏడేళ్ల బాలిక ఈ విధంగా హత్యకు గురవ్వడం.. ప్రభుత్వానికే సిగ్గుచేటని విమర్శించారు.

Read Also: Kishan Reddy : సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి

రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని రోజా దుయ్యబట్టారు. రెడ్ బుక్ లో తాము పేర్లు రాసిపెట్టుకున్నవారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల భద్రతపై చూపించడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా ? మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైతే డీజీపీని హెలికాప్టర్లో పంపిన సీఎం.. ఆడపిల్ల హత్యకు గురైతే డీజీపీని ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై హోంమంత్రి అలసత్వం బట్టబయలైందన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి.. వాళ్లనే బెదిరించి, ఇళ్లకు పంపేసి కేసును క్లోజ్ చేయించారని రోజా ఆరోపించారు. ముచ్చుమర్రి మైనర్ హత్యోదంతంలో నేటికీ మృతదేహం జాడను కనుక్కోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హోంమంత్రి ఉన్న పక్క ఊరిలోనే ఒక కుటుంబం తమను కాపాడాలని కోరినా.. పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చిన నిందితుడు మరో యువతిని పొట్టనపెట్టుకున్నాడని రోజా తెలిపారు.

Read Also: Asia Cup 2025 in India: టీమిండియా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. పాక్‌తో 3 మ్యాచ్‌లు ఆడ‌నున్న భార‌త్‌!

ఇలా రాష్ట్రంలో ఆడపిల్లలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పుడు పుంగనూరుకి జగన్ వస్తున్నారని తెలిసి.. పరువు పోతుందన్న భయంతో హోంమంత్రి అక్కడికి పరుగులు పెడుతున్నారన్నారు. గతంలో జరిగిన ఘటనలపై హోంమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా పుంగనూరు ఘటనలో నిందితులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. అలాగే జగన్ పై కక్షతో దిశను నిర్వీర్యం చేయకుండా.. మహిళల భద్రతకోసం వాడాలని సూచించారు. మిమ్మల్ని కన్నతల్లి ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత కూడా అంతే ముఖ్యంగా భావించి వారికి రక్షణ కల్పించాలన్నారు.

Read Also: Adventure Bikes : టాప్ – 5 అడ్వెంచర్‌ బైక్స్.. అదరగొట్టే ఫీచర్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Govenrment
  • ap police
  • Girl Murder Case
  • punganuru
  • RK Roja
  • ysrcp

Related News

Anudeep Katikala Arrest

Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.

Anudeep Katikala హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన కామెడీ షోలో

  • AndhraPradesh Police Special Leaves

    AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd