HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Priest Whips Women Cursed By Black Magic At Temple Fest In Namakkal

Woman Whipped:మహిళపై మూఢనమ్మకాల కొరడా.. తమిళనాడులో రెచ్చిపోయిన తాంత్రికులు!!

కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. భూతప్రేతాలపై నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి.

  • By Hashtag U Published Date - 01:21 PM, Sat - 28 May 22
  • daily-hunt
Temple Festival
Temple Festival

కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. భూతప్రేతాలపై నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఉన్న వరదరాజ పెరుమాళ్ చెల్లిఅమ్మన్ మర్రిఅమ్మన్ ఆలయం లో ఈవిధమైన ఓ ఘటన చోటుచేసుకుంది. గత నెల రోజులుగా ఈ గుడిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇటీవల ఊరి నడిబొడ్డున ఒక సమావేశం జరిగింది.

ఇందులో నల్లటి వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు కొరడా పట్టుకొని ఊగిపోయారు. చుట్టూ నిలపడ్డ వారిలో ఒక మహిళపై చేతబడులు జరుగుతున్నా యంటూ ప్రకటించారు. ఆ మహిళను ముందుకు పిలిచి.. కొరడా తో ఎడాపెడా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 18 గ్రామాల ప్రజలు చుట్టూ నిలబడి .. ఈ తంతును కళ్లారా చూశారు. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చివరకు ఆ బాధిత మహిళ కూడా రెండు చేతులు జోడించి మొక్కుతూ కొరడా దెబ్బలు భరించింది. ఈ కార్యక్రమంతో ఊరికి మేలు జరుగుతుందని గ్రామస్తులు నమ్ముతుండటం గమనార్హం. 20 ఏళ్ల క్రితం ఈ తరహా కార్యక్రమం గుడి లో నిర్వహించారు. రెండు వర్గాల మధ్య గొడవతో మధ్యలో ఆగిపోయిన ఈ కార్యక్రమం మళ్లీ ఇప్పుడు మొదలైందని స్థానికులు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • black magic
  • curse
  • Namakkal district
  • tamil nadu
  • temple festival
  • whip

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd