PM Modi YouTube Channel : ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ మరో రికార్డ్.. ఏమిటో తెలుసా?
PM Modi YouTube Channel : సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురులేకుండా దూసుకుపోతున్నారు.
- By Pasha Published Date - 09:51 AM, Wed - 24 January 24

PM Modi YouTube Channel : సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేశారు. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం వేళ ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ లైవ్ కొత్త రికార్డును నెలకొల్పింది. లైవ్‌లో ప్రపంచంలో అత్యధికంగా వ్యూస్ పొందిన యూట్యూబ్ ఛానెల్‌గా నరేంద్ర మోడీ ఛానల్(PM Modi YouTube Channel) నిలిచింది. అయోధ్య రామమందిరంలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠను నరేంద్ర మోడీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా 90 లక్షల మందికిపైగా వీక్షించారు. దీంతో ప్రధాని యూట్యూబ్ ఛానెల్ లైవ్ స్ట్రీమ్ వ్యూస్‌లో కొత్త రికార్డును తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ నెల 22న ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్‌లో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ‘PM Modi LIVE | Ayodhya Ram Mandir LIVE | Shri Ram Lalla Pran Pratishtha’, ‘Shri Ram Lalla Pran Pratishtha LIVE’ అనే టైటిల్స్‌తో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ లైవ్‌కి నరేంద్రమోడీ ఛానెల్‌లో ఇప్పటివరకు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి. అంతకుముందు మోడీ ఛానల్ లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగం 80 లక్షల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది. మోడీ ఛానల్‌లో అత్యధిక లైవ్ వ్యూస్ పొందిన మూడో ఈవెంట్‌గా ‘FIFA వరల్డ్ కప్ 2023 మ్యాచ్ ప్రత్యేక్ష ప్రసారం’ నిలిచింది. ఇక మోడీ ఛానల్‌లో అత్యధిక లైవ్ వ్యూస్ పొందిన Apple లాంచ్ ఈవెంట్ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లకు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 23,750 వీడియోలను అప్‌లోడ్ చేశారు. వీటికి మొత్తం 472 కోట్ల వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్‌లను పొందిన ప్రపంచంలోనే మొదటి రాజకీయ నేతగా మోడీ నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రపంచంలో టాప్ 10 ప్రత్యక్ష ప్రసారాలు
- నరేంద్ర మోడీ – రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ – 90 లక్షలు
- ISRO- చంద్రయాన్ 3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ – 80 లక్షలు
- CazéTV – ప్రపంచ కప్ 2022 బ్రెజిల్ vs క్రొయేషియా క్వాటర్ ఫైనల్ – 60 లక్షలు
- CazéTV – బ్రెజిల్ vs దక్షిణ కొరియా 2022 ప్రపంచ కప్ 52 లక్షలు
- CazéTV – వాస్కో vs ఫ్లెమెంగో 47 లక్షలు
- SpaceX- క్రూ డెమో-2 40 లక్షలు
- హిబ్ లేబుల్స్: bts నుండి వెన్న 37 లక్షలు
- Apple- Apple ఈవెంట్ 36 లక్షలు
- లా & క్రైమ్ నెట్‌వర్క్- డెప్ vs హియర్డ్ ట్రయల్ 35 లక్షలు
- ఫ్లూమినెన్స్ ఫుట్‌బాల్ క్లబ్: రియో కప్ ఫైనల్ 35 లక్షలు