NTR – Neel : ఎన్టీఆర్ – నీల్ సినిమా షూట్ మొదలయింది.. షూటింగ్ ఫోటో షేర్ చేసి..
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేసారు
- By News Desk Published Date - 03:53 PM, Thu - 20 February 25

NTR – Neel : ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో మంచి విజయం సాధించి 500 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. దేవర 2 సినిమాకు టైం పడుతుందని ఈ మధ్యలో మరో రెండు సినిమాలు పూర్తిచేస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. కేజిఎఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేసారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా నేడు ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ మొదలైందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
షూటింగ్ నుంచి ఒక ఫోటోని షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు మూవీ యూనిట్. ఈ ఫొటోలో ఏదో యాక్షన్ సీన్ జరుగుతున్నట్టు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్నట్టు ఉంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా షూట్ పూర్తిచేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఎప్పటికి రిలీజ్ అవుతుందో చూడాలి.
The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! 🔥🔥#NTRNeel shoot has officially begun.
A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses 💥💥
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial… pic.twitter.com/yXZZy2AHrA
— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2025
ఇక ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ మొదలవ్వడంతో సలార్ 2, దేవర 2 సినిమాలు ఆలస్యం అవుతాయని తెలుస్తుంది.
Also Read : OTT Platforms : ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు