Paytm – Ayodhya Offer : 100 శాతం క్యాష్ బ్యాక్.. అయోధ్య యాత్రికులకు పేటీఎం బంపర్ ఆఫర్
Paytm - Ayodhya Offer : అయోధ్య రామమందిరం దర్శనానికి వెళ్లే యాత్రికులకు పేటీఎం బంపర్ ఆఫర్ ఇచ్చింది.
- Author : Pasha
Date : 30-01-2024 - 1:52 IST
Published By : Hashtagu Telugu Desk
Paytm – Ayodhya Offer : అయోధ్య రామమందిరం దర్శనానికి వెళ్లే యాత్రికులకు పేటీఎం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ పేమెంట్ ప్లాట్‌ఫాం ద్వారా బస్సు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునే వారికి 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని పేటీఎం వెల్లడించింది. తక్కువ బడ్జెట్లో అయోధ్యకు వెళ్లిరావాలని ఆశించేవారికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ తెలిపింది. అయితే పేటీఎం ద్వారా సులువుగా బస్సు, విమాన టికెట్లను బుక్ చేసుకునే క్రమంలో ‘BUSAYODHYA’ అనే ప్రోమో కోడ్‌ను వాడాలి. బస్సు టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్టంగా రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇక విమానం టికెట్లను బుక్ చేసుకునే క్రమంలో FLYAYODHYA అనే ప్రోమోకోడ్‌ను వినియోగించాలి. విమానం టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్ఠంగా రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈవిధంగా పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఉచితమేనని పేటీఎం స్పష్టం చేసింది. దీనివల్ల టికెట్ బుకింగ్ కోసం చేసిన పేమెంట్‌లో ఎలాంటి కోతలు లేకుండా 100 శాతం రీఫండ్‌ను పొందొచ్చు. వన్-వే, రౌండ్-ట్రిప్ ఫ్లైట్ బుకింగ్స్ చేసుకునేవారికి మరింత తక్కువ ధరలకే విమానం టికెట్లు అందిస్తామని పేటీఎం(Paytm – Ayodhya Offer)చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
పేటీఎం ద్వారా టికెట్‌ను బుక్ చేసుకుంటే.. అయోధ్యకు వెళ్లే యాత్రికులకు లైవ్ బస్ ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ వల్ల యాత్రికులు ప్రయాణించేటప్పుడు తాము ఏ లొకేషన్‌లో ఉన్నామనే సమాచారాన్ని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు తెలియజేయొచ్చు. రామభక్తులు Paytm యాప్ ద్వారా అయోధ్య రామమందిర ట్రస్టుకు విరాళాలు కూడా ఇవ్వొచ్చు.
Also Read : CM Missing : జార్ఖండ్ సీఎం మిస్సింగ్.. 24 గంటలుగా కనిపించని సొరేన్
అయోధ్య రామమందిరం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పాత్ర
1986లో అయోధ్య వివాదాస్పద స్థలం గేట్లు తెరిచిన నాటి నుంచి 1989లో రాజీవ్‌గాంధీ హయాంలో శిలాన్యాస్ చేయడం వల్ల రామజన్మభూమి అంశం తెరపైకి వచ్చింది. 1992లో అయోధ్య వివాదం పతాకస్థాయికి చేరుకున్నప్పుడు మరింత ముదరకుండా చూసుకున్నది మాజీ ప్రధాని పీవీ నరసింహారావే. ‘మనం బీజేపీతో యుద్ధం చేయగలం, రాముడితో కాదు’ అని చెప్తూ సామరస్యపూర్వక పరిష్కారం కోసం పీవీ ఎనలేని కృషి చేశారు. 1991లో తన మొదటిస్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనూ అయోధ్య రామమందిరం గురించి ఆయన ప్రస్తావించారు.శాంతియుత చర్చల ద్వారా రాముడికి దివ్యమైన రామమందిరం, ముస్లింలకు అద్భుతమైన మసీదును కూడా నిర్మించాలని ఆకాంక్షించారు. ఒకవేళ చర్చలు విఫలమైతే సుప్రీంకోర్టు నిర్ణయమే అందరికీ ఆమోదయోగ్యం కావాలని తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
1992 కరసేవలో..
1992లో కరసేవకులు చేసిన దాడిలో బాబ్రీ మసీదు నేలమట్టం అయింది. సెక్యులర్ పార్టీలని చెప్పుకొనే కొన్ని పార్టీల నుంచి ఆ సమయంలో పీవీ విమర్శలు ఎదుర్కొన్నారు. ‘నోరు మెదపకుండా, ప్రేక్షకుడిగా చూస్తున్నందునే’ ఈ ఘటన జరిగిందని పీవీపై ఆ పార్టీలు విరుచుకుపడ్డాయి. బాబ్రీ ఘటనలో పీవీ ప్రమేయం లేదని, స్వాతంత్య్రంతర్వాత జరిగిన అత్యంత సిగ్గుచేటు ఘటన ఇదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. అయినప్పటికీ పీవీపై విమర్శల పరంపర ఆగలేదు. ఆయన ఏ తప్పూ చేయలేదని, రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నారని లిబర్హాన్ కమిషన్ స్పష్టం చేసి ఆయనకు క్లీన్‌చిట్ కూడా ఇచ్చింది.