News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Passengers On Spicejet Horror Flight Recount Narrow Escape

SpiceJet Accident Video: విమానంలో కుదుపులు, ప్రయాణికులకు గాయాలు!

ఇటీవల విడుదలైన 'రన్ వే 34' సినిమా స్టోరీని తలపించే ఒక ఘటన ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో చోటుచేసుకుంది.

  • By Hashtag U Updated On - 02:12 PM, Mon - 2 May 22
SpiceJet Accident Video: విమానంలో కుదుపులు, ప్రయాణికులకు గాయాలు!

ఇటీవల విడుదలైన ‘రన్ వే 34’ సినిమా స్టోరీని తలపించే ఒక ఘటన ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో చోటుచేసుకుంది. ముంబై నుంచి దుర్గాపూర్ కు సజావుగానే చేరుకున్న స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి-737 విమానం.. ఇంకాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా గాల్లో భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్ధం కాక అయోమయానికి లోనయ్యారు. ‘కాల్ భైశాఖి’ అనే తుఫాను కారణంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడంతో ఇలా జరిగింది. ఈవిషయంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి పైలట్ కు సమాచారం అందకపోవడంతో.. తుఫాను కారణంగా గాలి ఒత్తిడి ఎక్కువగా ఉన్న గగన తలానికి చేరగానే విమానం కుదుపులకు గురైంది. పైకి, కిందికి ఊగిసలాడింది.

వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది .. వెంటనే సీటు బెల్టులు పెట్టుకోవాలంటూ ప్రయాణికులకు హెచ్చరించారు. కుదుపుల మరింత ఎక్కువయ్యాయి. ఎంతగా అంటే.. ప్రయాణికుల సీట్ల ఎగువ భాగంలో ఉండే లగేజీ భాగం నుంచి లగేజీ జారిపోయి ప్రయాణికుల తలలపై పడింది. విమానం ఎంత బలమైన కుదుపులకు గురైందంటే.. సీట్లు కూడా తెగిపోయి ప్రయాణికులు కిందపడ్డారు. ప్రయాణికుల వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. ఎట్టకేలకు పైలట్ విమానంపై పట్టు సాధించి.. సురక్షితంగా దుర్గాపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. కానీ ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఒక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. మిగితా వారికి స్వల్ప గాయాలే కావడంతో చికిత్స అందించి పంపించారు. ఈఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, విమానం కుదుపులకు గురైన తర్వాత .. అందులోని ప్రయాణికులు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Extreme turbulence in a flight between Mumbai to Durgapur. I can feel what's going on in the minds of passengers when oxygen masks are coming down.

Airline was SpiceJet. Again it was B737 MAX.

Never travelling in this aircraft.
But thankfully no major accident. 🙏#SpiceJet pic.twitter.com/j7225Ag0UZ

— Yuvraj Sharma (@SharmaYuv1) May 1, 2022

Tags  

  • accident
  • Injure
  • international travellers
  • private jet
  • viral

Related News

Watch Video: వాహనదారుడా.. ఏమిటి ఈ సాహసం?

Watch Video: వాహనదారుడా.. ఏమిటి ఈ సాహసం?

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ప్రవేశపెడుతున్నా..

  • 75 Years Separation:  75ఏళ్ల తర్వాత సోదరులను కలుసుకున్న సోదరి…భావోద్వేగానికి లోనైన నెటిజన్లు.!!

    75 Years Separation: 75ఏళ్ల తర్వాత సోదరులను కలుసుకున్న సోదరి…భావోద్వేగానికి లోనైన నెటిజన్లు.!!

  • Viral Video : బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు విద్యార్థినుల గ్రూప్ వార్.. బెంగళూరులో రోడ్డుపై డిష్యుం డిష్యుం!!

    Viral Video : బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు విద్యార్థినుల గ్రూప్ వార్.. బెంగళూరులో రోడ్డుపై డిష్యుం డిష్యుం!!

  • Greenman Accident: వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!

    Greenman Accident: వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!

  • Buses Collide CCTV: రెండు బస్సులు ఢీ.. 52 మందికి గాయాలు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

    Buses Collide CCTV: రెండు బస్సులు ఢీ.. 52 మందికి గాయాలు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: