SIM Cards – October 1 Rules : అక్టోబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. వాళ్లకు 10 లక్షలు ఫైన్ కూడా !
SIM cards - October 1 Rules : సిమ్‌కార్డుల విషయంలో అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
- By Pasha Published Date - 10:13 AM, Mon - 11 September 23

SIM cards – October 1 Rules : సిమ్‌కార్డుల విషయంలో అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. సిమ్ కార్డుల విక్రయాల్లో సెఫ్టీ, సెక్యూరిటీని పెంచేలా ఈ నూతన నిబంధనలు ఉండబోతున్నాయి. దీనివల్ల కొత్త సిమ్ కార్డ్ ను కొనడం దగ్గరి నుంచి యాక్టివేషన్ చేసే దాకా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పెరుగుతుంది. కొత్త సిమ్ కార్డులు తీసుకునే సమయంలో వినియోగదారులు ఆధార్ ఆథెంటికేషన్, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ సిమ్ కార్డు పాడై పోయి, లేదా ఫోన్ పోయినప్పుడు అదే నంబర్ తో కొత్త సిమ్ కార్డు కోసం వెళ్లినప్పుడు కూడా ఆధార్ ఆథెంటికేషన్, కేవైసీ ప్రక్రియ కచ్చితంగా పూర్తి చేయాలి. అంటే కొత్త సిమ్ కార్డు తీసుకున్నా.. పాత నంబర్ నే రీయాక్టివేట్ చేయించుకున్నా సరే నిబంధనలు ఒకే విధంగా ఉంటాయి. ఇక అస్సాం, కాశ్మీర్, నార్త్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లోని టెలికాం ఆపరేటర్లు సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలపై పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాలని నిర్దేశించింది.
Also read : Free Heart Surgeries : నిమ్స్ లో ఫ్రీగా పిల్లలకు హార్ట్ సర్జరీలు.. ఎప్పటి నుంచి అంటే ?
సిమ్ కార్డులను అమ్మేవారు ఎక్కువ అలర్ట్ గా ఉండాలని ఈ కొత్త రూల్స్ చెబుతున్నాయి. సిమ్ కార్డు కోసం వచ్చే వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాకే.. సిమ్ ను అమ్మాలని నిబంధనల్లో ఉంది. ఒకవేళ అలా చేయకుంటే సిమ్ కార్డును అమ్మేవారికి రూ.10 లక్షల దాకా జరిమానా వేస్తారు. అంతేకాదు సిమ్ కార్డులను అమ్మే డీలర్లు సెప్టెంబరు నెలాఖరులోగా టెలికాం కంపెనీల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే సిమ్ కార్డులను అమ్మే అర్హతను వారు కోల్పోతారు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా , రిజిస్ట్రేషన్ లేకుండానే సిమ్ కార్డులను అమ్మితే.. అందుకు సంబంధిత టెలికాం కంపెనీలే బాధ్యత వహించాలి. రిజిస్ట్రేషన్ చేసుకోని డీలర్ల దగ్గర సిమ్ కార్డులు తీసుకున్న కస్టమర్ల వివరాలను టెలికాం కంపెనీలు తిరిగి పరిశీలించి నిజమా.. కాదా.. అనేది చెక్ చేయాలి. రీచార్జ్, బిల్లింగ్ సేవలు అందించే డీలర్లకు మాత్రం ఈ రిజిస్ట్రేషన్ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.