HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Free Heart Surgeries For Children In Nims Hyderabad From September 24th

Free Heart Surgeries : నిమ్స్ లో ఫ్రీగా పిల్లలకు హార్ట్ సర్జరీలు.. ఎప్పటి నుంచి అంటే ?

Free Heart Surgeries :  గుండె జబ్బులు వస్తే.. చికిత్స కోసం వైద్య ఖర్చులు భారీగా ఉంటాయి.  ప్రత్యేకించి పిల్లలకు ఆ ప్రాబ్లమ్స్ వస్తే పేరెంట్స్ ఎంతో మానసిక వేదనకు లోనవుతారు.

  • Author : Pasha Date : 11-09-2023 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Heart Surgeries
Free Heart Surgeries

Free Heart Surgeries :  గుండె జబ్బులు వస్తే.. చికిత్స కోసం వైద్య ఖర్చులు భారీగా ఉంటాయి.  ప్రత్యేకించి పిల్లలకు ఆ ప్రాబ్లమ్స్ వస్తే పేరెంట్స్ ఎంతో మానసిక వేదనకు లోనవుతారు. ఇలాంటి వారికి చేదోడుగా ఉండేలా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 30 వరకు నిమ్స్‌లో పిల్లలకు  గుండె సర్జరీలు ఫ్రీగా చేయనున్నారు. లక్షలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగే స్థోమత లేని వారికి ఇది మంచి అవకాశం. బ్రిటన్‌ వైద్యులు, నీలోఫర్‌ డాక్టర్స్, నిమ్స్‌ వైద్య నిపుణులు ఒక టీమ్ గా ఏర్పడి పిల్లలకు ఫ్రీగా ఈ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈవిషయాన్ని నిమ్స్ డైరెక్టర్‌ నగరి బీరప్ప మీడియాకు తెలిపారు. ఈ ఉచిత గుండె సర్జరీల క్యాంపునకు  ‘చార్లెస్‌ హార్ట్‌ హీరోస్‌ క్యాంపు’ అని పేరు పెట్టారు. బ్రిటన్‌ పీడియాట్రిక్‌ వైద్యులు డాక్టర్‌ దన్నపునేని రమణ ఆధ్వర్యంలో పదిమంది డాక్టర్స్ ఈ సర్జరీలు చేసేందుకు నిమ్స్ కు వస్తున్నారని చెప్పారు.

Also read : Chandrababu Remand: నాతో కలిసి వచ్చేది ఎవరు?

అప్పుడే పుట్టిన శిశువుల దగ్గరి నుంచి ఐదేళ్ల పిల్లల దాకా పుట్టుకతో, జన్యుపరంగా వచ్చే గుండె జబ్బులకు ఈ నెల 24 నుంచి 30 వరకు సర్జరీలు, ఇతర వైద్య చికిత్సలు ఉచితంగా (Free Heart Surgeries)  చేస్తారని వివరించారు. ఆరోగ్యశ్రీ, సీఎం సహాయనిధితో ఈ సర్జరీలు జరుగుతాయని తెలిపారు. గత ఏడాది కూడా ఇదేవిధంగా వారంపాటు ఫ్రీగా గుండె ఆపరేషన్లు నిర్వహించి 9 మంది పిల్లల ప్రాణాలను నిలబెట్టారు. నిమ్స్ ఆసుపత్రి కార్డియో థొరాసిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ అమరేశ్వరరావు సారథ్యంలో రోజూ సగటున 3 సర్జరీలు చేయనున్నారు. పూర్తి వివరాలకు 040-23489025 నంబరుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు కాల్ చేయొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • children
  • Free Heart Surgeries
  • heart disease
  • Nagari Birappa
  • NIMS Hyderabad
  • september 24th to 30th

Related News

Do you eat fast food? Be careful—experts warn that there is a risk of developing high blood pressure.

Hyderabad: ఫాస్ట్​ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు

ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు (బీపీ) సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీ

    Latest News

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd