Shashi Tharoor : మిస్రీ చేసిన కృషి ప్రశంసనీయం..ట్రోలింగ్స్‌ను ఖండించిన శశిథరూర్
“విక్రమ్ మిస్రీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారు. శాంతిని ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. అలాంటి ఒక అధికారి ఎవరు ట్రోల్ చేయాలి? ఎందుకు చేయాలి? ఆయన పనిని మించిన ప్రదర్శన వాళ్లకు సాధ్యమా?” అని ప్రశ్నించారు.
- By Latha Suma Published Date - 11:41 AM, Mon - 12 May 25

Shashi Tharoor : భారత్-పాకిస్థాన్‌ల మధ్య తాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు కొంత మేర ఉపశమనం లభించనుంది. అయితే, ఈ ప్రకటన అనంతరం మిస్రీపై కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ ప్రారంభించారు.
Read Also: Indian Airports : తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు..నోటామ్ జారీ
మిస్రీ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. దీనిపై రాజకీయ నాయకులు, మాజీ రాజనాయకులు తీవ్రంగా స్పందించారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ విషయంలో స్పందించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “విక్రమ్ మిస్రీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారు. శాంతిని ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. అలాంటి ఒక అధికారి ఎవరు ట్రోల్ చేయాలి? ఎందుకు చేయాలి? ఆయన పనిని మించిన ప్రదర్శన వాళ్లకు సాధ్యమా?” అని ప్రశ్నించారు.
అంతేకాక..మిస్రీతో పాటు భారత ఆర్మీకి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, నేవీకి చెందిన వింగ్ కమాండర్ మరియు హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్‌ల సేవలను కూడా ఆయన అభినందించారు. మహిళా అధికారులుగా వారు చేసిన సేవలు దేశానికి గర్వకారణమని తెలిపారు. ఇక మిస్రీపై ట్రోల్స్‌ను ఐఏఎస్ అసోసియేషన్, ఐఆర్‌టీఎస్ అసోసియేషన్‌లు తీవ్రంగా ఖండించాయి. “నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులను వ్యక్తిగతంగా విమర్శించడం అప్రయోజకమైనది. మిస్రీ దేశసేవ పట్ల అంకితభావంతో పని చేశారు” అని వారు తమ ప్రకటనలలో తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత విదేశాంగ విధానాన్ని ప్రతినిధ్యం వహించే వ్యక్తులపై ట్రోలింగ్ కంటే, వారి కృషిని గుర్తించడం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రత, శాంతి కోసమై పనిచేసే అధికారులు మనమందరం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Also: Lokesh Kanagaraj : కమల్ & రజిని మల్టీస్టారర్.. ఇద్దరికీ కథ చెప్పిన లోకేష్ కనగరాజ్..