Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!
చిత్ర, విచిత్ర ఘటనలకు భూ ప్రపంచాన్ని మించిన వేదిక మరొకటి లేదు. కంప్యూటర్ల యుగంలోకి అడుగు పెట్టినా.. ప్రకృతితో ఉన్న పేగు బంధాన్ని మనిషి కొనసాగిస్తున్నాడు.
- By Bhoomi Updated On - 03:52 PM, Tue - 5 July 22

చిత్ర, విచిత్ర ఘటనలకు భూ ప్రపంచాన్ని మించిన వేదిక మరొకటి లేదు. కంప్యూటర్ల యుగంలోకి అడుగు పెట్టినా.. ప్రకృతితో ఉన్న పేగు బంధాన్ని మనిషి కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలోనే మెక్సికో దేశంలోని ఒక్సాకా అనే చిన్న గ్రామానికి చెందిన మేయర్ విక్టర్ హ్యూగో సోసా, ఒక ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చాలా వైభవంగా నిర్వహించారు. మొసలిని పెళ్లి కూతురిలా ముస్తాబు చేశారు. వరుడైన మేయర్ పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. ఆ తర్వాత మొసలితో కలిసి ఊరేగింపుగా వెళ్లి పెళ్లి తంతు నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకను వీక్షించేందుకు భారీగా జనం తరలివచ్చారు.మన తెలంగాణలో వర్షాలు పడాలనే సంకల్పంతో కప్పలకు పెళ్లిల్లు చేస్తుంటారు. అలాగే మెక్సికోలో వర్షాల కోసం.. మొసలికి, మనిషికి ఇలా పెళ్లి జరిపిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎందుకు.. ఎప్పటి నుంచి..
ఒక్సాకా గ్రామంలో ప్రజల్లో చాలామంది చేపలు పట్టి జీవిస్తుంటారు. చేపలు ఎక్కువగా దొరకాలంటే స్థానిక జలాశయాల్లో నీళ్లు బాగా ఉండాలి. నీళ్లుం డాలంటే వర్షాలు పడాలి. వర్షాలు బాగా పడేందుకోసం.. మొసలికి, మనిషికి మ్యారేజ్ జరిపిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగానే గ్రామ మేయర్ ను పిలిచి, మొసలితో లగ్గం చేయించారు. మొసలిని మనిషి పెళ్లి చేసుకోవడమంటే ప్రకృతికి మనిషి దగ్గర కావడమని గ్రామస్తులు నమ్ముతారు. దీనివల్ల ప్రకృతి తమ ఊరిపై కారుణ్యం ప్రదర్శిస్తుందని విశ్వసిస్తారు.ఈ ఆచారం ఒక్సాకా గ్రామంలో 1789 నుంచే కొనసాగుతోంది.
In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu
— Reuters (@Reuters) July 1, 2022
Related News

Viral Video : వాట్ ఏ ఐడియా…చేయి కదపకుండా..వలలోకి వచ్చిపడుతున్న చేపలు..వైరల్ వీడియో!!!
పలు పట్టడం అంత ఈజీ కాదు. ఎంతో కొంత కష్టపడాల్సిందే. గాలం వేసి పట్టుకోవాలి. ఎంతో ఓపిక ఉండాలి. గాలానికి చేప తగలగానే..వెంటనే లాగాలి. పెద్ద చేపలు అయితే వలలు విసిరాల్సిందే.