Manipur violence : మణిపూర్ హింసాకాండ..11,000 అఫిడవిట్లు
- Author : Latha Suma
Date : 09-05-2024 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
Manipur violence: మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన జాతీ హింసలో దాదాపు 200 మందికి పైగా మరణాలు, వేలాది మంది నిర్వాసితులైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మణిపూర్ హింసాకాండ(Manipur violence)పై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటికి(సిఓఐ) 11,000 అఫిడవిట్లు(affidavits)వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ అఫిడవిట్లలో అధిక శాతం హింసాకాండలో ప్రభావితమైన బాధితుల నుండి వచ్చాయని అన్నారు. మరికొన్నింటిని కొండ, లోయ ప్రాంతాల్లోని పౌర సమాజ బృందాలు దాఖలు చేశాయని చెప్పారు. ఇప్పటి వరకు అందిన అన్ని అఫిడవిట్లను సిఒఐ పరిశీలించిందని, హింస ఇతర సంబంధిత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలో స్పందన కోరనుందని ఆ అధికారి తెలిపారు. నివేదికను ఖరారు చేసే ముందు ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులతో సహా సాక్షులను కూడా విచారించాలని సిఒఐ భావిస్తోందని అన్నారు.
Read Also: LSG Owner: KL రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. వీడియో వైరల్..!