Mistaken Identity Murder: తన భార్యే అనుకుని మరో మహిళను చంపిన వ్యక్తి..!!
భార్యతో మనస్పర్థలు...చంపాలని స్కెచ్ ఏశాడు. తాను అనుకున్నట్లు చంపేశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్.
- Author : Hashtag U
Date : 22-05-2022 - 1:06 IST
Published By : Hashtagu Telugu Desk
భార్యతో మనస్పర్థలు…చంపాలని స్కెచ్ ఏశాడు. తాను అనుకున్నట్లు చంపేశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. చంపింది తన భార్యను కాదు. తన భార్యత భ్రమించి మరో మహిళను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్నామలైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక ఇందిరానగర్ కు చెందిన దేవేంద్రన్ పశువుల వ్యాపారం చేస్తుంటాడు. మొదటి భార్య రేణుకామ్మాళ్ రెండేళ్ల క్రితం మరణించింది. దీంతో భర్త మరణించి ఒంటరిగా ఉంటున్న ధనలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచుగా గొడవపడేవారు. దీంతో మనస్తాపం చెందిన ధనలక్ష్మీ ఈ మధ్యే తన పుట్టింటికి వెళ్లింది.
ఈ క్రమంలోనే అంబూరు కంబికొల్లైకి చెందిన జాన్ బాషా కుమారుడు నవీద్ బాషా ఓ దొంగతనం కేసులో వేలురు సెంట్రల్ జైలులో ఉన్నాడు. దిక్కుకోల్పోయిన అతడి భార్య గౌసర్ తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ వద్ద జీవిస్తోంది. ధనలక్ష్మీని హత్య చేయాలని ప్లాన్ వేసిన దేవేంద్రన్ ఆమె కోసం ఆరా తీశాడు. ఆమె అంబూరి రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తుందని తెలుసుకున్నాడు. దీంతో శుక్రవారం అర్థరాత్రి అక్కడికి వెళ్లిన దేవేంద్రన్..చీకట్లో తన భార్య అనుకుని గౌసర్ ను కత్తితో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న ధనలక్ష్మీ ఉలిక్కిపడి లేచింది.
ఆమెను చూసిన దేవేంద్రన్ తాను కత్తితో పొడించింది ధనలక్ష్మీని కాదని తెలుసుకున్నాడు. ఆ వెంటనే ఆమెపైనా దాడిచేశాడు. ఈ లోపు అక్కడున్నవారు పరాయ్యేందుకు ప్రయత్నించిన దేవేంద్రన్ పట్టుకున్నారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. అప్పటికే గౌసర్ మరణించింది. గాయపడిన ధనలక్ష్మీని ఆసుపత్రికి తరలించారు.