CV Ananda Bose : మ్యాన్ మేడ్ ఫ్లడ్స్..మమత వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్
CV Ananda Bose : మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్న మమత వ్యాఖ్యలపై శనివారం గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'వరద నిర్వహణ దీర్ఘకాలిక చర్యగా ఉండాలి. సాధ్యమైనంతవరకు మౌలిక సదుపాయాలు విపత్తు నిరోధకంగా ఉండాలి.
- By Latha Suma Published Date - 03:27 PM, Sat - 21 September 24

Governor responded to Mamata comments: వరదలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని, ఆరోపణలకు బదులు నివారణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ అన్నారు. మమతాబెనర్జీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డివిసి) ఏకపక్షంగా వ్యవహరించి 5 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేసిందనీ, మానవులు సృష్టించిన ఈ వరదకు దక్షిణ బెంగాల్‌లోని అన్ని జిల్లాలు మునిగిపోయాయని, దీంతో తక్షణమే వరద సాయం కోసం నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానికి ఆమె లేఖ కూడా రాశారు.
Read Also: Tirumala Laddu Controversy : పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్..ప్రకాష్ కు విష్ణు కౌంటర్
ఈ క్రమంలోనే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్న మమత వ్యాఖ్యలపై శనివారం గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వరద నిర్వహణ దీర్ఘకాలిక చర్యగా ఉండాలి. సాధ్యమైనంతవరకు మౌలిక సదుపాయాలు విపత్తు నిరోధకంగా ఉండాలి. దీని కోసం దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలు తీసుకోవాలి. కానీ చర్యలు తీసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు (మమతా) బ్లేమ్ గేమ్ ఆడకండి’ అని ఆయన అన్నారు. కాగా, నీటిమట్టం పెరిగి పంష్‌కురా వద్ద జాతీయ రహదారి 16పైకి నీరు రావడంతో ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలను మూసివేయాలని సిఎం మమతాబెనర్జీ గురువారం ఆదేశించారు. ఈ వార్తలపై స్పందించిన గవర్నర్ ఆనంద్ బోస్ ముఖ్యమంత్రిని వివరణ కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం సరైనదేనా? ఒకవేళ అలా చేసినా దానికి గల కారణాలను వివరించాలని గవర్నర్ ముఖ్యమంత్రిని ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.