Ex MLA Kilari Rosaiah : రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..
Ex MLA Kilari Rosaiah : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు
- By Sudheer Published Date - 01:29 PM, Sat - 21 September 24

Ex MLA Kilari Rosaiah Joins Janasena : వైసీపీ నేతల (YCP Leaders) దారి ‘జనసేన కే’..అని తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు మీము చేరుతున్నాం అంటూ ప్రకటిస్తున్నారు. మొన్నటి వరకు 21 మంది తో ఉన్న గ్లాస్ (Janasena)..త్వరలో 100 దాటేలా ఉందని అంత మాట్లాడుకుంటున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన దెబ్బకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న (Jagan)..ఇక ఇప్పుడు పార్టీ నేతలు ఇస్తున్న షాకులకు ఏంచేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితికి వెళ్లిపోయాడు. ఎన్నికలకు ముందే కాదు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వరుసపెట్టి నేతలు బయటకు వస్తున్నారు. ఈ మధ్య చాలామంది నేతలు వైసీపీ కి రాజీనామా చేసి , టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు జనసేన దారిపడుతున్నారు.
రీసెంట్ గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సైతం వైసీపీ కి రాజీనామా చేసి జనసేన (Janasena) లో చేరేందుకు సిద్ధం అయ్యాడు. డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సమావేశమయ్యారు. తాను పార్టీలో చేరతానని అడిగిన వెంటనే ఒప్పుకుని తనను ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో గంటకు పైగా జరిగిన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని.. త్వరలోనే ఒంగోలులో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు వెల్లడించారు. తనతో పాటు ఒంగోలులోని పలువురు నేతలు కూడా జనసేనలో చేరతారని స్పష్టం చేసారు.
ఇక ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కాబోతున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కేవలం ఈయన మాత్రమే కాదు ఇంకా చాలామందే జనసేనలో చేరేందుకు ఉత్సహం చూపిస్తున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారట.
అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు పెద్ద పెద్ద నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారంటున్నారు. అయితే కూటమి పార్టీల్లోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా మూడు పార్టీలు సమన్వయం చేసుకుని, స్థానికంగా కూటమికి ఇబ్బంది లేకుండా చూడాలనే గత ఒప్పందం దృష్ట్యా చేరికలపై పవన్ తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటున్నారు. ఏది ఏమైనప్పటికి జనసేన లోకి భారీగా చేరికలు చేరుతుండడం తో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది.
Read Also : President Droupadi Murmu : 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవాలు