Man From 2047 : 2047 నుంచి వచ్చి..తనను తాను కలిసి..
బాలయ్య బాబు మూవీ "ఆదిత్య 369"లో టైం మెషీన్ సీన్స్ అద్భుతంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా!! అప్పట్లో ఆ ఫిక్షన్ మూవీ బాగా క్లిక్ అయ్యింది.. తాజాగా బ్రిటన్ కు చెందిన మైక్ విలియమ్స్ (Mike Williams) అనే వ్యక్తి టైం మెషీన్ తో ముడిపడిన ఒక ప్రకటన చేశాడు.. తాను టైం మెషీన్ లో ప్రయాణం చేసి 2047 సంవత్సరం(Man From 2047) నుంచి నేరుగా 2022 సంవత్సరంలోకి వచ్చానని చెప్పాడు.
- By Pasha Published Date - 07:56 AM, Wed - 24 May 23
బాలయ్య బాబు మూవీ “ఆదిత్య 369″లో టైం మెషీన్ సీన్స్ అద్భుతంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా!!
అప్పట్లో ఆ ఫిక్షన్ మూవీ బాగా క్లిక్ అయ్యింది..
తాజాగా బ్రిటన్ కు చెందిన మైక్ విలియమ్స్ (Mike Williams) అనే వ్యక్తి టైం మెషీన్ తో ముడిపడిన ఒక ప్రకటన చేశాడు..
తాను టైం మెషీన్ లో ప్రయాణం చేసి 2047 సంవత్సరం(Man From 2047) నుంచి నేరుగా 2022 సంవత్సరంలోకి వచ్చానని చెప్పాడు.
గత ఏడాది తాను టైం మెషీన్ నుంచి ల్యాండ్ కాగానే నేరుగా ఇంటికి వెళ్లానని తెలిపాడు. టైం మెషీన్ లో జర్నీ చేసి పాతికేళ్ళు ముందుకు వెళ్లడం వల్ల తన వయసు 25 ఏళ్ళు పెరిగిందని ((Man From 2047) చెప్పాడు.
తాను టైం మెషీన్ లో జర్నీ చేసి వెళ్ళిపోయి ముసలివాడిగా మారినా .. తన యవ్వన రూపం ఇంకా ఇంట్లోనే ఉందని తెలిపాడు.
“టైం మెషీన్ దిగి వచ్చి నేను నా ఇంట్లోకి వెళ్ళగానే..నా యవ్వన రూపం కలిగిన మైక్ విలియమ్స్ ఆశ్చర్యపోయాడు. ఇద్దరం సేమ్ టు సేమ్ ఉన్నామని చెప్పాడు. అవును .. నువ్వు నేను ఒకళ్ళమే. టైం మెషీన్ లో జర్నీ చేయడం వల్ల నా వయసు పెరిగిందంతే. అతడిని నేను నిక్ నేమ్ పెట్టి పిలిస్తే ఆశ్చర్యపోయాడు. చేతికి ఉన్న టాటూ చూపిస్తే నోరెళ్లబెట్టాడు. అతడి చేతిపైనా ఉన్న సేమ్ టాటూను నాకు చూపించాడు. మనిద్దరం ఒక్కళ్ళమే అని నా యవ్వనం రూపం కలిగిన మైక్ విలియమ్స్ ఒప్పుకున్నాడు” అని ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముసలి మైక్ విలియమ్స్ చెప్పాడు. ముసలి మైక్ విలియమ్స్, యువకుడిగా ఉన్నమైక్ విలియమ్స్ ఇద్దరూ కలిసి అపెక్స్ టీవీ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఆ ఇంటర్వ్యూ వీడియోలో ఇద్దరి ముఖాలను కనిపించకుండా బ్లర్ చేశారు. కేవలం ఇద్దరి చేతులపై ఉన్న సేమ్ టాటూను మాత్రమే చూపించారు. “మేమిద్దరం ఒక్కటే.. నేనే అతడు .. అతడే నేను..” అని ముసలి మైక్ విలియమ్స్ కామెంట్ చేశాడు. యంగ్ మైక్ విలియమ్స్ మాట్లాడుతూ.. ” అతడిని చూడగానే.. అతడి మాటలను వినగానే.. అది కూడా నేనే అని అర్ధమైంది” అని చెప్పాడు.
also read : No Set Top Box for TV’s: ఫ్యూచర్లో టివి కి సెట్ టాప్ బాక్స్ అవసరం లేదా?
2047 నుంచి ఎందుకు వెనక్కి వచ్చాడంటే..
ముసలి మైక్ విలియమ్స్ మాట్లాడుతూ.. “వర్చువల్ రియాలిటీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీలో నా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే టైం మెషీన్ తయారు చేసుకొని 2028 సంవత్సరంలోకి వెళ్లాను. ఆ టైంలో ఇన్నోవేటివ్ టెక్నాలజీ రంగంలో పనిచేయబోతున్న ఒక స్టార్టప్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు నా టైం మెషీన్ ను చూసి జాబ్ ఇచ్చారు. ఆ కంపెనీలో ఏళ్ళ కొద్దీ పనిచేశాను. 2042 సంవత్సరంలో మా కంపెనీ ప్రపంచ చరిత్రలో అత్యంత విప్లవాత్మక పరికరాన్ని తయారు చేసే పనిని ప్రారంభించింది. అదే టైమ్ మెషీన్. మేము దానికి “టైమ్ AWIX 200″ అని పేరు పెట్టాం. మనుషులు అందరికి ఉపయోగపడే టైమ్ మెషీన్ డెవలప్మెంట్ వర్క్ 2045 నాటికి దాదాపు పూర్తయింది. మేం దానితో ప్రయోగాలు చేయడం ప్రారంభించాము. మొదట మాంసం ముక్కను ఫ్యూచర్ టైం లోకి పంపాము.. ఆ తరువాత జంతువులు, ఎలుకలను పంపాము. ఈక్రమంలో టైం మెషీన్ కు సంబంధించిన నా ఐడియా క్లిక్ అయ్యింది . దీంతో 2046 డిసెంబర్ 28న మా కంపెనీ అధినేత ముందు ఒక ప్రపోజల్ పెట్టాను. నాకు కంపెనీలో షేర్స్ అలాట్ చేయమని చెప్పాను. కానీ ఆయన వినలేదు. నన్ను జాబ్ నుంచి తీసేశారు. ఆ టైం మెషీన్ వర్క్ కంపెనీకి మాత్రమే చెందుతుందని మా బాస్ చెప్పడం నాకు బాధ కలిగించింది. మోసపోయానని అర్ధమైంది. దీంతో నేను ఒక చిన్నపాటి టైం మెషీన్ తయారు చేసుకొని.. మళ్ళీ నార్మల్ టైం జోన్ లోకి వచ్చేశాను.” అని వివరించాడు. ఈవివరాలతో “mirror UK” అనే వెబ్ సైట్ ఒక వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది.
also read : 5G Farming: ఫ్యూచర్ అగ్రికల్చర్ : వ్యవసాయానికి 5జీ రెక్కలు!!
“ఇప్పుడు నేను .. నా యవ్వనం రూపం ఇద్దరం కలిసి సరికొత్త టైం మెషీన్ డెవలప్మెంట్ పై పనిచేస్తున్నాం. త్వరలో మీకు మా రిజల్ట్స్ ను తెలియజేస్తాం” అని ముసలి మైక్ విలియమ్స్ చెప్పాడు. కాగా , ఈ వీడియో కేవలం యూట్యూబ్ ఛానల్ వైరల్ అయ్యేందుకు తయారు చేసిన యాక్షన్ సీన్ లా కనిపిస్తోంది. ఒకవేళ ఒక వ్యక్తి టైం మెషీన్ లో జర్నీ చేసి ఫ్యూచర్ కు వెళ్ళిపోయి ఉంటే .. అతడు ఇంకా ప్రెజెంట్ లో ఉండే అవకాశమే ఉండదు. అందుకు విరుద్ధంగా ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరి వాదన ఉంది. అందులో ఎలాంటి లాజిక్ కనిపించడం లేదు.