HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ktr Condemns Arrest Of Former Mla Patnam Narender

Narender Reddy Arrest : ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవు : కేటీఆర్‌

ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అని కేటీఆర్‌ పోస్ట్ పెట్టారు. అయితే బీఆర్‌ఎస్‌ ఉద్యమకాలం నుండి ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్టులను ఎన్నో చూసిందని కేటీఆర్‌ తెలిపారు.

  • Author : Latha Suma Date : 13-11-2024 - 1:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Boycotting orientation session of legislators: KTR
Boycotting orientation session of legislators: KTR

BRS Leader Patnam Narender Reddy Arrest : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని లగచర్ల ఘటనలో ప్రమేయం ఉందనే అరోపణలతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే నరేందర్‌ రెడ్డి అరెస్టును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్‌ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలతో మాట్లాడినా నేతలను అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. ప్రజా తిరుగుబాటు అణచివేతకు అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.

తమను భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతుంది. ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అని కేటీఆర్‌ పోస్ట్ పెట్టారు. అయితే బీఆర్‌ఎస్‌ ఉద్యమకాలం నుండి ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్టులను ఎన్నో చూసిందని కేటీఆర్‌ తెలిపారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. పాలన గాలికి వదిలి అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులతో అణచివేయలేరన్నారు. అర్ధరాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​లో నిర్భందిచడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Read Also: New Degree Syllabus : విద్యార్థులకు జాబ్ సాధించి పెట్టేలా డిగ్రీ కొత్త సిలబస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • ktr
  • Lagacharla Incident
  • MLA Harish Rao
  • Patnam Narender Reddy arrest

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

  • Brs Car

    TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd