HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kits For 80 Percent Of School Students In The State Minister Lokesh

Minister Lokesh : రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్‌లు : మంత్రి లోకేశ్‌

కొందరి ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుదల చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే అంగన్వాడీ పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 06:09 PM, Fri - 13 June 25
  • daily-hunt
Kits for 80 percent of school students in the state: Minister Lokesh
Kits for 80 percent of school students in the state: Minister Lokesh

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 80 శాతం మంది పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్‌లు పంపిణీ చేశామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజే ఈ కిట్లు విద్యార్థులకు అందించామన్నారు. మిగిలిన 20 శాతం మంది విద్యార్థులకు కూడా ఈ నెల 20వ తేదీలోగా కిట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా, అంతమందికి తల్లికి వందనం నిధులు ఇవ్వడమే మా లక్ష్యం. కానీ కొందరి ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుదల చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే అంగన్వాడీ పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.

Read Also: Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ ధరల పెంపుకు ప్రభుత్వం కసరత్తు

మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై సన్న బియ్యం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యారంగంలో నాణ్యత కోసం 9,600 పాఠశాలల్లో “వన్ క్లాస్ – వన్ టీచర్” మోడల్ అమలులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో వచ్చే ఏడాది తేలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచడమే మా లక్ష్యం అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. జూన్ 16 సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. అలాగే మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని, ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖను తీవ్రంగా నాశనం చేశారంటూ లోకేష్ ఆరోపించారు. మునుపటి మంత్రి ఏమి చేశారో అర్థం కాదు. ప్రభుత్వ బడుల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసుకునేందుకు మాకు వంద రోజులు పట్టింది అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే న్యాయపరంగా పోరాటానికి సిద్ధమన్నారు. విద్యాశాఖలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పలు కీలక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు తగిన వసతులు, ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పాఠశాలల నాణ్యత పెంపుతో పాటు విద్యార్థుల చేరికలు పెంచడంపై కూడా మంత్రి లోకేష్ స్పష్టమైన దృష్టి ఉంచినట్లు కనబడుతోంది.

Read Also: Gambhir Mother: ఐసీయూలో గంభీర్ త‌ల్లి.. స్వ‌దేశానికి తిరిగివ‌చ్చిన టీమిండియా హెడ్ కోచ్‌!

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Educational development
  • Kits for students
  • Minister Lokesh
  • Thalliki Vandanam

Related News

Minister Lokesh

Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.

  • CM Chandrababu

    CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

Latest News

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

  • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

  • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd