CM Revanth : గవర్నర్‌గా కేసీఆర్, కేంద్రమంత్రిగా కేటీఆర్: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
- By Latha Suma Published Date - 02:20 PM, Fri - 16 August 24

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం జరుగుతుందన్నారు. అంతేకాక..కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రిగా, హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. బీఆర్ఎస్‌కు ప్రస్తుతం నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వారి విలీనంతో కవితకు రాజ్యసభ ఇస్తారన్నారు. ఇక నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి ఇవ్వనున్నట్లు చెప్పారాయన.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని ఒకవేళ ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగకమానదన్నారు. ఇక రైతు రుణమాఫీకి 5 వేల కోట్ల రిజర్వ్ నిధులు ఉంచామన్న సీఎం రుణమాఫీ కాని వారు కలెక్టరేట్‌కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చని సూచించారు. తన మార్క్ ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించానన్నారు.
కాగా, ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర అధిష్టానం పెద్దలను కలుస్తానని చెప్పారు. ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్‌లో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్గీకరణపై పార్టీ అగ్ర నాయకులు చెప్పిందే తాను చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. వర్గీకరణపై తాము స్టాండ్ తీసుకున్నామని, దానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై రాజకీయంగా తనకు ఒక స్టాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Mint Leaves: ప్రతిరోజు పుదీనా ఆకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?