Love Marriages Ban : లవ్ మ్యారేజెస్ పై బ్యాన్.. ఆ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం
Love Marriages Ban : కర్ణాటకలోని కలబురిగి జిల్లా డోంగర్గావ్ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం చేసింది.
- By Pasha Published Date - 12:50 PM, Tue - 17 October 23

Love Marriages Ban : కర్ణాటకలోని కలబురిగి జిల్లా డోంగర్గావ్ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం చేసింది. లవ్ మ్యారేజెస్ ను బ్యాన్ చేయాలని ఈ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తల్లిదండ్రుల అనుమతి లేని లవ్ మ్యారేజెస్ కు అంగీకరించకూడదని అభిప్రాయపడ్డారు. గ్రామ సర్పంచ్ శాంతకుమార్ కె ములాగే ఆధ్వర్యంలో చేసిన ఈ తీర్మానం కాపీని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రేమ వివాహాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్కారును కోరారు. దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తే యువత దారితప్పకుండా ఉంటారని పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ డోంగర్గావ్ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లు ఎక్కువకాలం కలిసి ఉండలేకపోతున్నారని, ఫెయిలైపోతున్న లవ్ మ్యారేజ్ లను ప్రోత్సహించడం సరికాదని డోంగర్గావ్ సర్పంచ్ శాంతకుమార్ కె ములాగే అంటున్నారు. డోంగర్గావ్ గ్రామపంచాయతీ పరిధిలో 2022 సంవత్సరంలో 13 జంటలు లవ్ మ్యారేజెస్ చేసుకున్నాయి. వీరిలో చాలామంది తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయి మరీ.. లవ్ మ్యారేజ్ (Love Marriages Ban) చేసుకున్నారు.