Rain Alert : రేపటి నుంచి 6 రోజులు వర్షాలు..ఎక్కడంటే ?
Rain Alert : భగభగ మండుతున్న సూర్యుడు ఆదివారం ఒక్కసారిగా చల్లబడ్డాడు.
- By Pasha Published Date - 03:49 PM, Sun - 28 May 23

Rain Alert : భగభగ మండుతున్న సూర్యుడు ఆదివారం ఒక్కసారిగా చల్లబడ్డాడు. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలి వీచింది. హైద్రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also read :Never Give Up: వెల్ డన్ గర్ల్.. కీప్ ఇట్ అప్, భారీ వర్షంలోనూ ఆగని పరుగు!
దీంతో ఇన్ని రోజులుగా ఎండ వేడికి అల్లాడుతున్న హైద్రాబాద్ నగరవాసులు కొంత ఉపశమనం పొందారు. కూల్ గా ఫీల్ అయ్యారు. రేపటి (సోమవారం) నుంచి 6 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.