CareEdge Ratings : ప్రపంచ టారిఫ్ యుద్ధం దూసుకుపోతున్నా తన స్థానాన్ని నిలబెట్టుకున్న ఇండియా ఇంక్
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ పోర్ట్‌ఫోలియోకు క్రెడిట్ నిష్పత్తి FY25 రెండో భాగంలో బలపడింది - ఇది ఇండియా ఇంక్ యొక్క స్థితిస్థాపకతకు నిదర్శనం. అయితే, ముందుకు సాగే ప్రయాణం సజావుగా లేదు.
- By Latha Suma Published Date - 04:16 PM, Wed - 2 April 25

CareEdge Ratings : అప్‌గ్రేడ్స్ మరియు డౌన్‌గ్రేడ్స్ నిష్పత్తిని కొలిచే కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ క్రెడిట్ నిష్పత్తి, H2 FY25లో 2.35 రెట్లు బలపడింది. ఇది H1 FY25 నుంచి 1.62 రెట్లు పెరిగింది. ఈ కాలంలో, 386 అప్‌గ్రేడ్‌లు మరి యు 164 డౌన్‌గ్రేడ్‌లు జరిగాయి. బలమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ వ్యయం నుండి ప్రయోజనం పొందిన రంగాల ద్వారా మొదటి అర్ధ భాగం లో అప్‌గ్రేడ్ రేటు 12% నుండి 14%కి పెరిగింది. ఇక, డౌన్‌గ్రేడ్ రేటు 200 బేసిస్ పాయింట్లు తగ్గి 6%కి చేరుకుంది. దీనికి కారణం మైక్రోఫైనాన్స్, అన్‌సెక్యూర్డ్ వ్యాపార రుణాలను అందించే NBFCలలో ఆస్తి నాణ్యత ఆందోళనలు, కెమికల్, ఐరన్ & స్టీల్ రంగాలలోని చిన్న-పరిమాణ సంస్థలు, అలాగే ఎగుమతి-కేంద్రీకృత కట్, పాలిష్డ్ డైమండ్ సంస్థలు ఎదుర్కొంటున్న ధరల ఒత్తిళ్లు.
Read Also: Betel Leaves : తమలపాకు, మణిపూసల మాలలకు జీఐ ట్యాగ్.. ఎందుకు ?
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులపై కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ సచిన్ గుప్తా తన అభిప్రాయాలను పంచుకుంటూ.. “ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ పోర్ట్‌ఫోలియోకు క్రెడిట్ నిష్పత్తి FY25 రెండో భాగంలో బలపడింది – ఇది ఇండియా ఇంక్ యొక్క స్థితిస్థాపకతకు నిదర్శనం. అయితే, ముందుకు సాగే ప్రయాణం సజావుగా లేదు. అమెరికా సుంకాల విధింపు ఎగుమతి ఆధారిత రంగాలకు, ముఖ్యంగా విచక్షణా వ్యయంపై ఆధారపడిన వాటికి వాటి జోరును దెబ్బతీస్తుంది. అదే సమయంలో ఇతర ప్రభావిత ఆర్థిక వ్యవస్థల నుండి తీవ్రమైన ధరల పోటీని కూడా రేకెత్తిస్తుంది. ఈ అనిశ్చితి స్పష్టమైన సంకేతాలు వెలువడే వరకు ప్రైవేట్ రంగ మూలధన వ్యయాన్ని పక్కన పెట్టవచ్చు. అయితే, అన్నీ నిరాశాజనకంగా లేవు – వాణిజ్య ఒప్పందాలు, రూపాయి విలువ తగ్గుదల ఎగుమతిదారులకు చాలా అవసర మైన ఉపశమనాన్ని అందించగలవు. అదే సమయంలో, కార్పొరేట్ ఇండియా బలమైన, డెలివరేజ్డ్ బ్యాలెన్స్ షీట్లు బాహ్య అస్థిరతకు వ్యతిరేకంగా దృఢమైన కవచంగా పనిచేస్తాయి’’ అని అన్నారు.
తయారీ, సేవల రంగానికి కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ క్రెడిట్ నిష్పత్తి గణనీయంగా పుంజుకుంది. దాని క్రెడిట్ నిష్పత్తి H1 FY25లో 1.21 నుండి H2 FY25లో 2.06కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ, ముఖ్యంగా మధ్య తరహా, దేశీయ-కేంద్రీకృత సంస్థలలో బిజినెస్ ఫండమెంటల్స్ మెరుగుపడటాన్ని ఈ పెరుగు దల ప్రతిబింబిస్తుంది. కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ (కార్పొరేట్ రేటింగ్స్) సీనియర్ డైరెక్టర్ రంజన్ శర్మ ఈ రికవరీ విస్తృత ఆధారిత స్వభావాన్ని గురించి మాట్లాడుతూ.. ‘‘ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్, సబ్-ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్ కేటగిరీలు రెండింటిలోనూ క్రెడిట్ నిష్పత్తిలో మెరుగుదల సమానంగా వ్యాపించింది. దీనికి మిడ్-కార్పొరేట్ సంస్థలు బల మైన దేశీయ డిమాండ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా వీటిని ముందుకు నడిపించాయి. పెద్ద కార్పొరేట్లు కూడా ఆరోగ్యకరమైన క్రెడిట్ నిష్పత్తిని కొనసాగించాయి. మునుపటి కాలాల నుండి వాటి స్థిరమైన పనితీరును కొన సాగించాయి. అప్‌గ్రేడ్ వేవ్‌కు నాయకత్వం వహించిన రంగాలలో మూలధన వస్తువులు, వాహన రంగం, ఆటో మోటివ్ భాగాలు, రియల్ ఎస్టేట్ ఉన్నాయి. ఇవన్నీ పెరుగుతున్న వినియోగం, మౌలిక సదుపాయాల జోరు నుండి ప్రయోజనం పొందాయి. సేవల రంగం కూడా స్థిరమైన అభివృద్ధిని చూసింది. ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ రంగాలు వాటి పటిష్ఠ ప్రగతి పథాన్ని కొనసాగిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్స్ స్థిరమైన ప్రదర్శనకారిగా నిలిచింది, దాని దీర్ఘకాలిక స్థితిస్థాపకతను బలోపేతం చేసుకుంది అని అన్నారు.
Read Also: Betel Leaves : తమలపాకు, మణిపూసల మాలలకు జీఐ ట్యాగ్.. ఎందుకు ?