Betel Leaves : తమలపాకు, మణిపూసల మాలలకు జీఐ ట్యాగ్.. ఎందుకు ?
ఈ తమలపాకుల రుచి, సువాసన, ఆకారం మన దేశంలో సాగయ్యే ఇతర రకాల తమలపాకుల(Betel Leaves) కంటే చాలా భిన్నమైందన్నారు.
- By Pasha Published Date - 03:52 PM, Wed - 2 April 25

Betel Leaves : ఆ తమలపాకు, మణిపూసల మాలలకు భౌగోళిక గుర్తింపు (జాగ్రఫికల్ ఇండికేషన్ -జీఐ) లభించింది. దీన్నే మనం ‘జీఐ ట్యాగ్’ అని పిలుస్తాం. తమిళనాడులోని కన్యాకుమారి పరిధిలో ఉన్న తోవాలైలో లభించే అరుదైన మణిపూసలతో తయారుచేసే మాలలు ఈ ఘనతను సాధించాయి. తమిళనాడులోని తంజావూర్ జిల్లా కుంభకోణం ప్రాంతంలో ‘కొళుందు వెట్రిలై’గా పిలిచే తమలపాకుకు సైతం జీఐ ట్యాగ్ దక్కింది. మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ, ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులకు జీఐ ట్యాగ్‌ను కేటాయిస్తుంటారు. ఈవివరాలను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) న్యాయవాది పి.సంజయ్ గాంధీ వెల్లడించారు. కావేరీ నదీ జలాలు, సారవంతమైన భూముల్లో ‘కొళుందు వెట్రిలై’ తమలపాకు తోటలు సాగవుతాయని చెప్పారు. ఈ తమలపాకుల రుచి, సువాసన, ఆకారం మన దేశంలో సాగయ్యే ఇతర రకాల తమలపాకుల(Betel Leaves) కంటే చాలా భిన్నమైందన్నారు. ఈ తమలపాకులు గుండె ఆకారంలో ఉంటాయని తెలిపారు. ‘కొళుందు వెట్రిలై’ తమలపాకులు తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయన్నారు.
Also Read :Indian Prisoners : ఏ దేశంలో ఎంతమంది భారతీయ ఖైదీలున్నారు.. తెలుసా ?
తమిళనాడు నుంచి ఇప్పటికే..
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ తాళం బుర్ర, సేలం సుంగుడి చీర, కాంచీపురం పట్టు, మదురై మల్లి, తంజావూరు కళాత్మక పల్లెం, శ్రీవిల్లిపుత్తూరు పాలకోవా, కోవిల్‌పట్టి వేరుశనగ మిఠాయి, పళని పంచామృతం, కొడైకెనాల్ పర్వతాలపై పండించే వెల్లుల్లి, విలాచ్చేరి మట్టిబొమ్మలకు జీఐ ట్యాగ్ లభించింది. ఈ ట్యాగ్‌ను పొందేందుకు తమిళనాడుకు చెందిన వందవాసి చేప, జవ్వాదు చింతపండు, కొల్లిమలై మిరియాలు కూడా పోటీ పడుతున్నాయి.
Also Read :BRS Defecting MLAs: చేతులు కట్టుకొని కూర్చోవాలా.. మా నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తాం : సుప్రీంకోర్టు
తమలపాకులతో ఆరోగ్య ప్రయోజనాలివీ..
తమలపాకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కాల్షియం కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. 10 నుంచి 12 తమలపాకులను ఉడకబెట్టి, ఆ మిశ్రమంలో తేనె కలుపుకుని తాగితే నోరు ఆరోగ్యంగా ఉంటుంది. నోటి దుర్వాసన సమస్య ఉంటే తొలగిపోతుంది. తమలపాకు దంతాలు , చిగుళ్లకు మేలు చేస్తుంది. తమలపాకు రసాన్ని దంతాలు మరియు చిగుళ్ళ నొప్పి మరియు వాపులకు ఇంటి నివారణిగా ఉపయోగించవచ్చు.