Air pollution : ఢిల్లీ భారీగా వాయు కాలుష్యం..రేపటి నుండి నూతన నిబంధనలు..!
రేపు ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రేపటి నుండి రాజధానిలో నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
- Author : Latha Suma
Date : 14-11-2024 - 7:48 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. AIQ లెక్కల ప్రకారం 200 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న గాలి మంచిది కాదు. కానీ ఢిల్లీలో ఏకంగా 432 పాయింట్లకు పైగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీంతో కాలుష్య వ్యతిరేక చర్యలు అమలకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రేపు ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రేపటి నుండి రాజధానిలో నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఇందులో జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ నగరంలోకి “బిఎస్-3” వాహనాలు, డీజిల్ వాహనాలు ప్రవేశం పై నిషేధం విధించింది. ఢిల్లీలోని రహదారులు, చెట్ల పై నీళ్లు చల్లే వాహనాల సంఖ్య పెంచింది. అలాగే ఐదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు సాయంత్రం, రాత్రిళ్లులో మంచుదుప్పటి కప్పేస్తుంది. నగరంలో గరిష్ఠంగా 29 డిగ్రీలు, కనిష్ఠం 16 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక బుధవారం ఢిల్లీ నగరంలో సూర్యుడి కిరణాలు సైతం కనిపించలేదు. మరో వైపు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Also: Delhi Mayor Election : ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ