HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Harish Rao Meets Kcr Again Discussion On Kaleshwaram Commission Notices

Telangana : మళ్లీ కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ..!

ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్‌ హరీశ్ రావుతో పాటు ఇతర అనేక నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Author : Latha Suma Date : 28-05-2025 - 1:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao meets KCR again.. Discussion on Kaleshwaram Commission notices..!
Harish Rao meets KCR again.. Discussion on Kaleshwaram Commission notices..!

Telangana:  మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీ పలు రాజకీయ సంకేతాలు పంపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్‌ హరీశ్ రావుతో పాటు ఇతర అనేక నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ ఇటీవల ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతోంది. ఇందులో కీలక పాత్ర పోషించిన హరీశ్ రావుకు సంబంధించి వివిధ అంశాలపై స్పష్టత కోరుతూ కమిషన్ నోటీసులు పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కేసీఆర్‌తో భేటీలో హరీశ్ రావు తన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.

Read Also: TDP Mahanadu : నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

విచారణకు సంబంధించి తదుపరి చర్యలు, న్యాయపరమైన అవకాశాలు, పార్టీ స్థాయిలో మద్దతు వంటి అంశాలపై రెండు గంటలపాటు చర్చ జరిగినట్లు చెబుతున్నారు. కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ అనేది కేవలం నోటీసులపై చర్చకే పరిమితమైందా లేక పార్టీ లోపల కొత్త పరిణామాలకు నాంది పలుకుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హవా పెరుగుతున్న నేపథ్యంలో భారాస బలహీనపడుతుండగా, కొత్త నాయకత్వంపై చర్చలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు భవిష్యత్తు రాజకీయ పాత్ర, పార్టీ నేతగా తన భద్రతపై కూడా కేసీఆర్‌తో చర్చించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గత కొంతకాలంగా హరీశ్ రావు, కేసీఆర్ మధ్య కొంతంత విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో హరీశ్‌కు పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంచినట్లయిందన్న వాదనలు వినిపించాయి.

కానీ, తాజాగా జరిగిన ఈ భేటీ ఆ ఉహాగానాలను కొంతవరకూ తిప్పికొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ రాజకీయ సమీకరణాలపై పునరాలోచన చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా ఈ భేటీ గురించి బీఆర్‌ఎస్‌ వర్గాలు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ పార్టీ పునర్నిర్మాణ దిశగా, వచ్చే ఎన్నికల వ్యూహాలు, న్యాయపరమైన అంశాల్లో పరస్పర సహకారానికి ఇది నాంది కావచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాలు పరిశీలించినట్లయితే, ఈ భేటీ కేవలం ఒక భేటీగా మిగిలిపోయే అవకాశం లేదు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరుగుతుందనే సంకేతాలు ఈ భేటీ ద్వారా అందుతున్నాయి.

Read Also:  High Court CJ : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేశ్‌‌ కుమార్‌ సింగ్‌.. మరో 3 హైకోర్టులకూ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • harish rao
  • Kaleshwaram Commission notices
  • kcr

Related News

Kcr Bday

KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ పుట్టినరోజు వేడుకలు నేడు (ఫిబ్రవరి 17) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి

  • Brs Car

    TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd